ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో ?
Harshali Malhotra Latest Pic :అది బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా , ఏ ఇండస్ట్రీ అయినా సరే, … చైల్డ్ ఆర్టిస్టుగా రాణించి పెద్దయ్యాక హీరోయిన్ అవతారం ఎత్తి, దూసుకుపోవడం చాలామంది విషయంలో జరిగింది. అలాగే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ భజరంగీ భాయిజాన్ సినిమాలో పాకిస్తాన్ నుండి వచ్చి హీరో సల్మాన్ ఖాన్ కు ఓ పాప దొరుకుతుంది. చిన్న పాపగా ముద్దులు ఒలికే మాటలతో అందరినీ కట్టిపడేసింది.
అప్పటికి 6,7ఏళ్ళు ఉన్నాయి ఆపాప పేరు హర్షాలీ మల్హోత్రా. ఆ సినిమాలో మున్నీ పేరుతో ఫేమస్ గా మారిన ఆ పాప తాజాగా సోషల్ మీడియా పోస్ట్ లు చూసి అంతా షాకవుతున్నారు. 2015లో సల్మాన్ ఖాన్ సినిమాలో చిన్న పాపగా కనిపించిన మున్నీ ఇప్పుడు హీరోయిన్ అయిపోయిందా అని ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నిజంగా మున్సీని చాలా మంది హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించాలని చూస్తున్నారు.
కానీ ఇప్పుడు మున్నీ వయసు కేవలం 12 ఏళ్లు. ఉత్తరాది అమ్మాయిలు చిన్న వయసులోనే పెద్దగా కన్పించడం సహజం. అయితే ఎంతలేదన్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలంటే, కొంచెం వయస్సు రావాలి. చాలా మంది హీరోయిన్స్ కూడా 15 ఏళ్ల లోపులోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందుకే మున్నీ కొన్నాళ్ళు ఆగాల్సిందే అని అంటున్నారు. ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చి , ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.