బాలింతలు ఈ ఆహారాలను తీసుకుంటున్నారా…అయితే జాగ్రత్త…?
Foods to avoid after delivery :గర్భధారణ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో డెలివరీ తర్వాత కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డెలివరీ అయ్యాక బాలింతలు ఆహారం విషయంలో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. మన పెద్దవాళ్ళు కూడా అవి తినాలి అవి తినకూడదు అంటూ జాగ్రత్తలు చెప్పడం వింటూనే ఉంటాం. బాలింతలు ఎక్కువ పోషకాలు మరియు త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవాలి. బిడ్డకు పాలు ఇస్తారు కాబట్టి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడంతో పాటు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో కాఫీకి దూరంగా ఉండాలన్న విషయం మనకు తెలిసిందే అలాగే బాలింతలు కూడా కాఫీకి దూరంగా ఉంటేనే మంచిది
ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ తల్లిపాల ద్వారా శిశువుకు వెళ్లి శిశువు ఆరోగ్యం ను పాడుచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కెఫిన్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. అంతేకాకుండా మసాలా ఫుడ్ కి కూడా దూరంగా ఉండాలి. బ్రకొలి కి కూడా దూరంగా ఉండాలి దీని కారణంగా బాలింతలకు కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. వేరుశెనగ గింజల కు కూడా దూరంగా ఉండాలి ఎందుకంటే కొంతమంది కి అలర్జీ వచ్చే అవకాశం ఉంది తల్లితో పాటు బిడ్డకు కూడా రావచ్చు.