Movies

బిచ్చగాడు సినిమా వెనక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో…అసలు నమ్మలేరు

Bichagadu Full Movie :సినిమా ఏదైనా, హీరో ఎవరైనా సరే, కంటెంట్ ఉంటె తెలుగు ఆడియన్స్ బాగానే ఆదరిస్తారు. సూర్య, విశాల్ లాంటి నటుల సినిమాలు ఆదరణ పొందడమే కాదు, విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు మూవీని ఆదరించడం మామూలు విషయం కాదు. ఏ స్టార్ హోదాలేని యితడు ఈ సినిమా ద్వారా వందలమంది డిస్ట్రిబ్యూటర్లకు లక్షాధికారులుగా చేసాడు. కథలో దమ్ముంటే చాలు ఆదరిస్తామన్న విషయాన్నీ మరోసారి రుజువుచేసారు. 50రోజులకు 20కోట్ల వసూళ్లు వచ్చాయి. బన్నీ నటించిన సరైనోడు మంచి రన్నింగ్ లో ఉంది, మహేష్ బ్రహ్మోత్సవం, నితిన్ అ ఆ వంటి మూవీస్ రిలీజ్ కి దగ్గరలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో బిచ్చగాడు మూవీని కొనడానికే ఎవరూ ముందుకు రారని అన్నారు. అయితే 2016మే13శుక్రవారం బిచ్చగాడు స్క్రీన్ మీదికి వచ్చేసింది. 50థియేటర్లలో రిలీజయింది. మంచి టాక్.

ఆతర్వాత బ్రహ్మోత్సవం ప్లాప్ కావడంతో 200స్క్రీన్స్ కి చేరిన బిచ్చగాడు మూవీకి ఎన్ని సినిమాలు అడ్డొచ్చినా దూసుకుపోయింది. 45లక్షలతో కొన్న ఈ మూవీ 50సెంటర్స్ కి పైనే 100రోజులు ఆడేసి,30కోట్లు దక్కించుకుంది.డైరెక్టర్ శశి ఒకరోజు ఇంట్లో పేపర్స్ తిరగేస్తుంటే, ఓ బిజినెస్ మ్యాన్ బిచ్చగాడుగా మారిన ఘటనపై రాసిన ఆర్టికల్ కంటపడింది. వెంటనే దానిమీద ఫోకస్ పెట్టాడు. దాంతో ధనవంతుడు బిచ్చగాడుగా మారి, అతడు పడిన కష్టాలను ప్రస్తావిస్తూ స్క్రిప్ట్ మొదలు పెట్టాడు. ఏడాదిన్నర కష్టపడి బిచ్చగాడు స్టోరీ సిద్ధం చేసాడు. కానీ ఈ టైటిల్ తో సినిమా అనగానే 4,5గురు ప్రొడ్యూసర్స్ నో అనేసారు. ఈలోగా ఇంకో సినిమా చేసి, కమర్షియల్ గా సక్సెస్ కొట్టాడు. అయినా బిచ్చగాడు మూవీ చేయలేని బాధ అలానే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గా హిట్స్ అందుకుంటున్న విజయ్ ఆంటోని తెలుగులో మహాత్మా, దరువు లాంటి మూవీస్ కి మ్యూజిక్ అందించాడు.

ఆంటోనీని హీరోగా పెట్టి తీయాలన్న నిర్ణయానికి వచ్చాడు. కథ వినిపించాడు. కథ వింటూనే ఆ పాత్రలోకి వెళ్ళిపోయాడు. భావోద్వేగానికి గురై, ఇది మనమే చేద్దాం అనేశాడు. కొరియన్ స్టాండర్డ్ లో చేయాలనుకున్నా, నష్టం రాకూడదని మన స్టైల్లోనే చేద్దామని శశి అన్నారు. 2014నవంబర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. 2015జనవరిలో షూటింగ్ కొలచిలో స్టార్ట్. ఫోటోగ్రాఫర్ గా శశి బ్రదర్ ప్రసన్న. చాలామందిని కొత్తవారిని తీసుకున్నారు. నిజంగా బిచ్చగాళ్ల మధ్య విజయ్ ఆంటోని ని పెట్టి, రహస్యంగా ఆటోల్లో కెమెరాలు పెట్టి షూట్ చేసారు. అయితే కొత్త బిచ్చగాడు ఎవరని అక్కడి బిచ్చగాళ్ళు కోప్పడ్డంతో వర్కవుట్ అయిందని చిత్ర యూనిట్ ఆనంద పడింది.

ఒకరోజు ఓ అమ్మాయి అయితే, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా ఏదైనా పనిచేసుకోవచ్చు కదా, అని చీవాట్లుపెట్టేసింది. ఇలా ఎన్నో అనుభవాలు ఈ సినిమాకు వచ్చాయి. కూతురి పెళ్లికోసం ఒకడు, మరో పనికోసం ఇంకొకడు బిచ్చగాడుగా మారిన ఉదంతాలు ఎదురయ్యాయి. ఫైటింగ్ లో విజయ్ భుజానికి గాయం అయినప్పటికీ షూటింగ్ ఆగలేదు. తానే హీరో, ప్రొడ్యూసర్ కావడంతో మొదట్లో వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టాలని విజయ్ అనుకున్నా, సీన్స్ అయ్యేకొద్దీ స్వయంగా తానే మ్యూజిక్ కూడా కంపోజ్ చేసాడు. వంద దేవుళ్ళే కల్సి వచ్చినా సాంగ్ ని విజయ్ పాడడం విశేషం. మొత్తాన్ని షూటింగ్ అయ్యాక కష్టాలు మొదలై, తర్వాత కాసుల వర్షం కురిపించింది.