Movies

గుండమ్మ కథ సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ మేఘన తండ్రి ఎవరో తెలుసా ?

Gundamma katha serial meghana :తెలుగు బుల్లితెరమీద పలు ఛానల్స్ ద్వారా సీరియల్స్ ప్రసారం అవుతూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో చైల్డ్ ఆర్టిస్టులు కూడా విశేష ప్రాచుర్యం పొందుతున్నారు. ఇక జి తెలుగులో ప్రసారమవుతున్న గుండమ్మ కథ సీరియల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గుండమ్మ తన అందంతో , అభినయంతో ఆకట్టుకుంటోంది.

గుండమ్మ పాత్ర వేస్తున్న చిన్నారి పేరు మేఘన అశ్విని. ఇంట్లో ముందుగా మేగీ అని పిలుస్తారు. జూన్ 27న విజయవాడలో సునీల్, శ్రీలక్ష్మి దంపతులకు జన్మించిన ఈమె 6వ తరగతి చదువుతోంది. తండ్రికి యాక్టింగ్ మీద మక్కువ ఉండడం, మేఘనకు కూడా యాక్టింగ్ అంటే ఇష్టం కావడంతో ఈ రంగంలోకి అడుగుపెట్టింది. సిటీ కేబుల్ లో యాంకరింగ్ చేసింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్ లో నాగార్జునతో కల్సి మేఘన నటించింది.

పెయింటింగ్స్ బాగా వేస్తుంది. ఎలాంటి డైలాగునైనా అలవోకగా చెప్పగలదు. ప్రయాణం చేయడం ఇష్టం. ఇక జి తెలుగులో డ్రామా జూనియర్స్ సీజన్ 5ఆడిషన్స్ కి వచ్చి, సెలక్ట్ అయింది. అయితే గుండమ్మ కథలో సూటవుతుందని భావించి అందులో ఛాన్సిచ్చారు. అలా ఆడియన్స్ కి దగ్గరైన మేఘన అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్ లో నటించింది. ఓ పక్క స్టడీస్ చేస్తూనే పలు యాడ్స్ లో కూడా చేస్తోంది. అలాగే అవికా గౌర్ నటించే సినిమాలో హీరోయిన్ చిన్ననాటి పాత్ర వేస్తోంది.