యమలీల సీరియల్ నటి రజిని గురించి ఈ నిజాలు మీకోసమే
yamaleela serial heroine :దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో ఒకప్పుడు అలీ హీరోగా వచ్చిన యమలీల బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత యమలీల 2ప్లాప్ అయింది. అయితే ఇప్పుడు ఈటీవీలో మళ్ళీ యమలీల పేరుతొ ప్రసారమవుతున్న ఈ సీరియల్ చిన్నికి ఫ్రెండ్ గా నటిస్తున్న రజిని తొలి సీరియల్ అయినప్పకిటికీ తన అందంతో నటనతో ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.
రజిని అసలు పేరు శ్రద్ధా భలే రావు 1997నవంబర్ 17న వరంగల్ జన్మించిన ఈమెకు శ్రావణి భలేరో అనే సోదరి ఉంది. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తిచేసిన ఈమె కు చిన్ననాటి నుంచి నటనపై మక్కువ ఉండడంతో గ్రాడ్యుయేషన్ అయ్యాక బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.
శ్రద్ధా కు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. పారిస్, స్విట్జర్లాండ్, రష్యా, వంటి దేశాల్లో పర్యటించి అక్కడ టూరిస్ట్ ప్రాంతాలను చూసి వచ్చ్చింది. యమలీల మూవీలో రజిని కేరక్టర్ లో నటిస్తూ ఆకట్టుకుంటోంది.