నర్సింగ్ యాదవ్ భార్య ఎవరో తెలుసా…ఏమి చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు
Narsing Yadav :సినిమాల్లో హీరో, హీరోయిన్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు, సపోర్టింగ్ ఆర్టిస్టులు కీలక భూమిక పోషిస్తారు. ఇక అగ్ర నటులతో పాటు ఈనాటి స్టార్ హీరోల తో కల్సి నటించిన సపోర్టింగ్ ఆర్టిస్ట్ నర్సింగ్ యాదవ్ గురించి చెప్పుకోవాలంటే, అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటారు. విలన్ గా, ముఖ్యంగా కామెడీ పండించే విలన్ గా రాణిస్తూ ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో చేసారు.
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నర్సింగ్ యాదవ్ ది పెద్ద కుటుంబం. నలుగురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములు. ఇతని అన్న పొలిటీషియన్. కార్పొరేటర్ గా పనిచేసాడు. ఇతడి తమ్ముడు వ్యాపారస్తుడు. రామ్ గోపాల్ వర్మ క్షణం క్షణం మూవీతో సిల్వర్ స్క్రీన్ మీద మెరిసిన నర్సింగ్ యాదవ్ తొలి సినిమాతోనే మన్ననలు అందుకున్నాడు. అక్కడి నుంచి ఖైదీ నెంబర్ 150వరకూ జైత్రయాత్ర సాగుతోంది.
గత పాతికేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ 450కి పైగా సినిమాల్లో నటించిన నర్సింగ్ యాదవ్ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు. ప్రేమించి పెళ్లిచేసు కున్నాడు. ఇతడి భార్య పేరు చిత్ర. ఈమె ఓ పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్. రఫ్ గా ఉండే నర్సింగ్ యాదవ్ అందంగా ఉండే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ధనవంతురాలైన ఈమె పెద్దలను ఒప్పించి తిరుపతిలో పెళ్లిచేసుకున్నారు. వీళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు. ఇంటర్ చదువుతున్నాడు.