వీరు సాధించిన రికార్డ్స్ ఎప్పటికీ నిలిచి ఉంటాయి…ఎవరు బ్రేక్ చేయలేరు part-1
Tollywood Movies Part 1 :కొన్ని సినిమాలు రికార్డ్ క్రియేట్ చేసి ఆతరవాత వేరే సినిమాల వలన వీటి రికార్డులు మాయం అయిపోతుంటాయి. అయితే ఎప్పటికీ చెరగని ముద్రవేసి కొన్ని సినిమాల రికార్డులు పదిలంగానే ఉంటాయి. ఎన్టీఆర్ ని తీసుకుంటే 17సార్లు హీరో ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు. ఇక ఒకే ఏడాది 7సినిమాలు డైరెక్ట్ వందరోజులు ఆడాయి. లవకుశ విడుదలైన అన్ని కేంద్రాల్లో 100డేస్ ఆడడం ఎప్పటికి నిలిచిపోయే రికార్డు. 1965లో కృష్ణతో కల్సి ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేసారు. ఇక దానవీర సూర కర్ణ మూవీ 1977,1986, 1994లో రిలీజై మూడు సార్లు కూడా కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరో 15సినిమాలు 175రికార్డ్స్ సాధించాయి.
ఇక అక్కినేని నాగేశ్వరరావు సినిమా చరిత్రలో 114మూవీస్ డైరెక్ట్ 100డేస్ ఆడిన సినిమాలున్నాయి. బాలరాజు, కీలుగుఱ్ఱం ఇండస్ట్రీ హిట్స్. మొత్తం 8ఇండస్ట్రీ హిట్స్ తో టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ గల హీరోగా అక్కినేని నిలిచేవుంటారు. 8కేంద్రాల్లో 300రోజులు ప్రేమాభిషేకం ఆడింది. సూపర్ స్టార్ కృష్ణ 324మూవీస్ చేసి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేయగా, ఒకే ఏడాది 18సినిమాల్లో నటించి మరో రికార్డ్ క్రియేట్ చేసారు. ఇక 60సార్లు ఒకే నెలలో తన సినిమాలే రిలీజయిన ఘటనలు న్నాయి. ఒకే ఏడాది 7మూవీస్ డైరెక్ట్ 100డేస్ ఆడిన సినిమాలున్న హీరోగా మరో రికార్డు ఉంది. 1983లో ఈ ఫీట్ సాధించారు.
శోభన్ బాబు కి 1975లో హైదరాబాద్ లో నాలుగు మూవీస్ డైరెక్ట్ 100డేస్ మూవీస్ ఉన్నాయి. అదే ఏడాది 4సినిమాలు 10సెంటర్స్ లో 100డేస్ ఆడిన రికార్డ్ కూడా ఈయనదే. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇప్పటికే 7ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఇందులో ఆరు మూవీస్ వరుసగా ఆరేళ్ళు సాధించడం రికార్డ్. 1987నుంచి 1992దాకా ప్రతియేటా ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరో ఈయన. ఇంద్ర, ఠాగూర్ మూవీస్ 100సెంటర్స్ కి పైగా వందరోజులు ఆడిన సినిమాలు గా మరో రికార్డ్. నందమూరి బాలకృష్ణకు ఒకే రోజు రెండు సినిమాలు రిలీజవ్వడం ఓ రికార్డ్ అయితే, ఆ రెండు కూడా రాజమండ్రిలో 100డేస్ ఆడడం మరో రికార్డ్. 1993లో బంగారు బుల్లోడు, నిప్పురవ్వ మూవీస్ ఈ రికార్డ్ సాధించాయి. 70కి పైగా సెంటర్స్ లో 100డేస్ సినిమాలు నాలుగు అంటే సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు,, లక్ష్మి నరసింహ,సింహా ఉన్నాయి. లెజెండ్ మూవీ రెగ్యులర్ షోస్ తో వెయ్యి రోజులు ఆడడం కూడా మరో రికార్డు.