ఆచార్య సినిమా కోసం రిస్క్ చేస్తున్న చరణ్…ఒక్క సెట్ కి అన్ని కోట్లా?
Achary movie :లాక్ డౌన్ కారణంగా ఆగిన ఆచార్య మూవీ సెట్స్ మీదికి వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ మూవీలో కాజల్ అగర్వాల్ కథానాయిక నటిస్తోంది. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఓ కీలక పాత్రలోనూ చరణ్ యాక్ట్ చేస్తున్నాడు. కనిపించేది కొద్దిసేపే అయినా చరణ్ పాత్ర చాలా హైలెట్‌గా ఉంటుదని టాక్.
అందుకే ఈ సినిమా కూడా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్‌లోకి తీసుకురావాలనుకుంటున్న ‘ఆచార్య’ కోసం రూ.20 కోట్లతో సెట్ వేసారట. ఇప్పటికే దీని గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నా, చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే మరో ఆసక్తికర వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరళ కు చెందిన ప్రముఖ ఆలయాలు, వీధులను హైదరాబాద్ లో నిర్మించబోతు న్నార ని అందుకే భారీ గా ఖర్చు చేస్తున్నారని టాక్. దక్షిణాది ఆలయాల్లో కేరళ ఆలయాలు అంటే విభిన్నంగా ఉంటాయి. వాటిని రీ క్రియేట్ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు. కొన్ని కీలక సన్నివేశాలను ఆ సినిమాలో చిత్రీకరించే ఉద్దేశ్యంతోనే అంత ఖర్చు పెట్టి మరీ సెట్టింగ్ వేస్తున్నట్లుగా చెబుతున్నారు.