స్టార్ హీరో కూతుళ్లను గుర్తు పట్టారా…ఆలస్యం చేయకుండా వెంటనే చూసేయండి
Manchu Vishnu Daughters :స్టార్ హీరోలు సోషల్ మీడియాలో ఏది పెట్టినా చక్కర్లు కొట్టేస్తుంది. అందునా కరోనా సమయంలో స్టార్ హీరోలే కాదు, వాళ్ళ పిల్లలు కూడా సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అనగానే ఓ ఇమేజ్ గల నటుడు గుర్తొస్తారు. మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మనోజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.
విష్ణు అనే మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు ఆతర్వాత అస్త్రం, ఢీ , సలీం, దేనికైనా రెడీ, దూసుకెళ్తా, వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చు కున్నాడు. తాజాగా మంచు విష్ణు మోసగాళ్లు అనే మూవీలో హీరోగా చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. జెఫ్రీ జీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ఈమూవీ వచ్చే వేసవికి రిలీజ్ కానుంది.
అలాగే మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న సన్నాఫ్ ఇండియా అనే మూవీకి ప్రొడ్యూసర్ గా విష్ణు వ్యవహరిస్తున్నాడు. ఇక విష్ణుకి గారాల కూతుళ్లయిన అరియనా, వివియానా అనే చిన్నారుల పుట్టిన రోజు సందర్బంగా ఇంస్టాగ్రామ్ లో పిక్స్ పోస్ట్ చేసాడు. ఇవి అభిమానులను అలరిస్తూ వైరల్ గా మారాయి.