గృహలక్ష్మి సీరియల్ యాక్టర్ అశ్విన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా?
Gruhalakshmi serial actor ashwin : తక్కువ టైమ్ లోనే ఎక్కువమంది ఆడియన్స్ ని సంపాదించుకుని స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ దూసుకెళ్తోంది. ఇక ఈ సీరియల్ లో శృతి కి భర్తగా నటిస్తున్న అశ్విన్ తన నటనతో, అందంతో ఆకట్టుకుంటున్నాడు. ఎక్కువమంది ఆడియన్స్ కి తన నటనతో దగ్గరయ్యాడు. మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన అశ్విన్ అసలుపేరు సుమిత్.
యితడు పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే. ఎం ఏ జర్నలిజం , మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసిన సుమిత్ కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద మక్కువ ఉంది. దీంతో స్టడీస్ అయ్యాక మోడల్ గా, యాక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా , ప్రొడ్యూసర్ గా, దర్శకుడుగా ఇలా అన్ని విభాగాల్లో సుమిత్ రాణించాడు. జిమ్ చేయడం చాలా ఇష్టం. ఈటివి అభిరుచి ప్రోగ్రాం లో యాంకర్ గా కూడా చేసాడు.
రంగం, రగడ వంటి టివి షోస్ లో సుమిత్ తన ప్రతిభ చూపించాడు. తూర్పు పడమర, అత్తారింటికి దారేది, రుతుగీతం, గంగా మంగ, అమ్మ నా కోడలా, కల్యాణ వైభోగం, నువ్వా నేనా, ఎవరి నీ మోహిని, ఇలా పలు సీరియల్స్ లో నటించిన సుమిత్ కొన్ని యాడ్స్ లో కూడా చేసి మెప్పించాడు. జెమినిలో రక్త సంబంధం సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సుమిత్ కి పెళ్లి కూడా అయింది. వీరికి ఓ పాప ఉంది.