నాని అక్క దీప్తి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
Hero Nani Sister :డైరెక్షన్ విభాగంలో అడుగుపెట్టి, హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సక్సెస్ చిత్రాలతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మూడు సినిమాల్లో నటించబో తున్నాడు. ఇక విలన్ గా చేసిన వి మూవీ కరోనా కారణంగా ఓటిటి వేదికగా విడుదలై నిరాశపరిచింది.
అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలో అష్టా చెమ్మా మూవీలో హీరోగా ఛాన్స్ కొట్టేసాడు. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈగ మూవీలో చేసింది కొద్దిసేపే అయినా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. భలే భలే మగాడివోయ్, జెర్సీ లాంటి హిట్ మూవీస్ తో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు.
అయితే నాని అక్కయ్య కూడా యూట్యూబ్ ఛానల్ లో ఓ షార్ట్ ఫిలిం కి డైరెక్టర్ గా చేస్తోంది. ఆమె చేసిన ఒక నాన్న షార్ట్ ఫిలిం కి పేరు రావడంతో తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా వెండితెరకు డైరెక్టర్ గా ఆమెను పరిచయం చేయాలని నాని చూస్తున్నాడట. ఇప్పటికే అ పేరుతొ ఓ మూవీ కూడా నాని నిర్మించిన నేపథ్యంలో అక్క డైరెక్షన్ లో మూవీకోసం రెడీ అవుతున్నాడట.