MoviesTollywood news in telugu

కోట,బాబు మోహన్ కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా ?

kota srinivasa rao and babu mohan :కోట శ్రీనివాసరావుతో కలిసి బాబు మోహన్ చాలా సినిమాల్లో నటించాడు. ఇద్దరూ కామెడీ బాగా పండించారు. ఇక తండ్రి కొడుకులుగా, అన్నదమ్ములుగా, స్నేహితులుగా నటించారు. అలాగే కోట బాస్‌గా నటిస్తే, అతని అసిస్టెంట్‌గా బాబు మోహన్ ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ ఆహ్వానం సినిమాలో మాత్రం కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ అబ్బాయి పాత్రలో చేసారు. వీళ్లిద్దరు కలిసి దాదాపు 60 పైగా సినిమాల్లో జోడిగా నటించారు. కోట శ్రీనివాస రావు 1999లో బీజేపీ తరుపున విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే సమయంలో బాబు మోహన్ కూడా ఆందోళ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, చంద్రబాబు క్యాబినేట్‌లో మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత బాబు మోహన్ మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా వీళ్లిద్దరు కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని, తమ అనుభూతులను షేర్ చేసుకున్నారు.

వీళ్ళిద్దరూ కల్సి తొలిసారి నటించిన సినిమా ‘బొబ్బలి రాజా’. వెంకటేష్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కోట, బాబూమోహన్ జోడీకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకుల చిత్రాల్లో కలిసి నటించి, వెండితెరపై తమ జోడికి ఎదురులేదని చాటారు. వీరిద్దరినీ పోలిస్తే, కోట శ్రీనివాసరావు పండించే వినోదంలో పెద్దరికం ఉంటుంది. విలనిజంలో రాజసం ఉంటుంది. క్యారెక్టర్లో పనితనం ఉంటుంది. కామెడీ పండించడంలో, విలనిజం చూపడంలో కన్నీరు పెట్టించడంలో కూడా ఆరితేరిన నటుడిగా గుర్తింపు పొందారు. ఇక బాబు మోహన్ కామెడీతో పాటు విలనిజాన్ని తనదైన శైలిలో పండించారు. అలాంటి ఈ ఇద్దరు కలిసి చేసిన కామెడీ అదిరి పోయింది. ఒకప్పుడు కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ జోడి లేని సినిమా ఉండేది కాదు.

అంతేకాదు వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమాపై కోట, బాబూమోహన్ స్పందించారు. చిరంజీవి హీరోగా నటించిన ‘ప్రాణం ఖరీదు’తో తొలిసారి వెండితెరపై మెరిసిన కోట శ్రీనివాస రావు ఆ తర్వాత గ్యాప్ తీసుకొని టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాతో తిరిగి నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. దానితో ఇక కోట శ్రీనివాసరావు నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘ఆహుతి’ సినిమాలో తొలిసారి వెండితెరపై బాబు మోహన్ కనిపించారు. తర్వాత ‘అహనా పెళ్లంట’ సినిమాలో నటించినా.. అందులో కోటతో ఈయనకు కాంబినేషన్ సీన్స్ లేవు. ఆ తర్వాత ‘అంకుశం’ సినిమాలో పొలిటికల్ లీడర్స్‌ను మేనేజ్ చేసే పాత్రలో పాయే అంటూ చేసిన యాక్టింగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత లారీ డ్రైవర్ సినిమా కూడా మంచి పేరు తెచ్చింది.