మనసిచ్చి చూడు సీరియల్ లో నటించిన యశ్వంత్ రియల్ లైఫ్
Manasichi choodu serial yashwanth :బుల్లితెర మీద ఎన్నో సీరియల్స్ ఆడియన్స్ ఆదరణ పొందుతున్నాయి. ప్రముఖ ఛానల్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న మనసిచ్చిచూడు సీరియల్ విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇందులో ఆదికి తమ్ముడిగా, భానుకి బావగా,రేణుకి భర్తగా నటిస్తున్న సూరి తన అందంతో , అమాయకపు నటనతో ఆకట్టుకుంటున్నాడు.
ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్న సూరి అసలు పేరు యస్వంత్ కనిగిరి. సూర్య అని కూడా పిలుస్తారు. అది,సూరి నిజ జీవితంలో మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. డాన్స్ లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటారు. ఇక పలు సినిమాల్లో అలాగే పలు సీరియల్స్ లో పాజిటివ్, నెగెటివ్ రోల్స్ లో యస్వంత్ ఆకట్టుకున్నాడు.
ఈటీవీలో ఆడదే ఆధారం సీరియల్ లో కౌశిక్ గా నెగెటివ్ రోల్ లో నటించాడు. నేను శైలజ సీరియల్ లో నెగెటివ్ రోల్ చేసాడు. అలాగే మాటే మంత్రం సీరియల్ లో కూడా నటించిన యస్వంత్ మనసిచ్చి చూడు, బంగారు పంజరం సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. నాని హీరోగా నటించిన జెర్సీ తదితర సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెండితెరకన్నా, బుల్లితెరమీద బాగా ఆకట్టుకున్నాడు.