అబార్షన్ గురించి ఖచ్చితంగా … తెలుసుకోవలసిన విషయాలు
pregnent women:గర్భం దాల్చిన తర్వాత ఆ తల్లి ఆనందానికి అవధులుండవు. అనుక్షణం కడుపులోని శిశువు గురించి ఎన్నో ఆలోచనలు, ఊహలకు ప్రాణం పోస్తారు. ఎప్పుడెప్పుడు తొమ్మిదినెలలు నిండుతాయా.. తాను ప్రాణం పోసిన బిడ్డను కనులారా చూసుకోవాలన్న ఆ ఆనందపు క్షణాల కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ.. ఉన్నట్టుండి జరిగే అబార్షన్.. ఆ మహిళతో పాటు, ఫ్యామిలీకి తీరిన బాధను మిగులుస్తుంది.
తనకు పుట్టబోయే బిడ్డకోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే తల్లికి తన బిడ్డను కోల్పోయినప్పుడు పొందే బాధ అంతా ఇంతా కాదు. అది ఎప్పుడైనా కావచ్చు. గర్భం పొందిన తర్వాత లేదా డెలివరీకి ముందు లేదా.. ఎలాంటి సందర్భంలో జరిగినా.. చాలా బాధగా ఉంటుంది. ఎప్పుడైతే అబార్షన్ అవుతుందో.. అప్పుడు ఆ మహిళ ఆశలు, కలలు ఆవిరవుతాయి. అబార్షన్ అంటే.. కడుపులో పెరుగుతున్న శిశువును కోల్పోవడమే.
బేబీ పూర్తీగా డెవలప్ కానప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే అబార్షన్ రకరకాల కారణాలుంటాయి. తల్లి పూర్తీ ఆరోగ్యంగా లేకపోవడం, ఇన్ఫెక్షన్స్, గాయాలు, వయసు, గర్భాశయానికి సంబంధించిన సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటివి అబార్షన్ కు కారణమవుతాయి. అయితే కారణాలు ఎన్ని ఉన్నా.. అబార్షన్ గురించి కొన్ని వాస్తవాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
కొంతమంది.. అనవసర కారణాలను అబార్షన్ కి అనుసంధానిస్తూ ఉంటారు. కాబట్టి అబార్షన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 3 వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం.. రెండోసారి అబార్షన్ చాలా మంది మహిళలు ఒక్కసారి అబార్షన్ అయిందంటే.. రెండోసారి కూడా అబార్షన్ అవుతుందని నమ్ముతారు.
కానీ.. ఇది అవాస్తవం. ఒకవేళ ఫస్ట్ ట్రైమ్ స్టర్ సమయంలో అబార్షన్ అయిందంటే.. సెకండ్ ప్రెగ్నన్సీ కూడా అబార్షన్ అవుతుందనడానికి ప్రూఫ్ లేదని నిపుణులు చెబుతున్నారు. బ్లీడింగ్ చాలామంది గర్భిణీ స్త్రీలకు స్పాటింగ్, కొద్దిగా రక్త స్రావం అనేది కామన్. గర్భిణీల్లో ఇలాంటి లక్షణాలు.. అబార్షన్ కి సంకేతమని.. చాలామంది నమ్ముతారు. కానీ.. ఇలా బ్లీడింగ్ అవడం ఫస్ట్ ట్రైమ్ స్టర్ లో కామన్. కాబట్టి.. అలాంటి సందర్భాల్లో డాక్టర్ ని సంప్రదించడం మంచిది. బ్లీడింగ్ అయినంత మాత్రాన.. అబార్షన్ అని అపోహ పడరాదు. గ్యాప్ చాలామంది మహిళలు.. ఒకసారి అబార్షన్ అయిన తర్వాత కనీసం 3 నుంచి 6 నెలలు గ్యాప్ తీసుకుని తర్వాత కన్సీవ్ అవడానికి ప్రయత్నించాలని భావిస్తారు.
కానీ అబార్ణన్ అయిన నెల తర్వాత కన్సీవ్ అవడానికి ప్రయత్నించడం వల్ల ఎలాంటి హాని జరగదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాకపోతే.. ఆ మహిళ శారీరకంగా, మానసికంగా.. హెల్తీగా ఉంటే చాలని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అబార్షన్ అయిన తర్వాత.. గైనకాలజిస్ట్ ని రెగ్యులర్ గా సంప్రదించి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం మంచిది.