Healthhealth tips in telugu

మనం కొనే మందులు అసలైనవా…నకిలీవా….ఎలా తెలుసుకోవాలి?

Medicines online :ఇటీవల కాలంలో మాయగాళ్లు ప్రతీదాన్ని కల్తీ చేసి పడేస్తున్నారు. నూనెలు, బియ్యం… ఇలా ఒక్కటేమిటి ప్రతీదీ కల్తీనే. ఆఖరికి అనారోగ్యం తగ్గడానికి వేసుకునే మందులను కూడా కల్తీ చేసేస్తున్నారు.

దీంతో వ్యాధులు తగ్గకపోగా మరిన్ని వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదముంది. కాబట్టి మనం కొనే మందులు ఒరిజినల్ వా లేక నకిలీవా తెలుసుకొని కొనుక్కోవాలి.

అది ఎలాగంటే……

మనం కొనుగోలు చేసే ప్రతీ ట్యాబ్లెట్ స్ట్రిప్ మీద తప్పనిసరిగా 9 అంకెల యూనిక్ ఐడీ నంబర్ ఉంటుంది. ఆ 9 అంకెల నెంబర్ ని మొబైల్ లో టైప్ చేసి 9901099010 అనే నెంబర్ కి మెసేజ్ చేయాలి. కొద్దిసేపట్లోనే మన మొబైల్ కు ఓ మెసేజ్ వస్తుంది. ఆ రిప్లై మెసేజ్ లో ఆ డ్రగ్ తయారయిన ఫార్మా కంపెనీ పేరూ, అది తయారయిన బ్యాచ్ నంబరూ ఉంటాయి.

అవి మన దగ్గరున్న మందులతో సరిపోలితే అది నకిలీ కాదు. ఒక వేళ ఆ మెసేజ్ లో వచ్చిన వివరాలలో ఏ ఒక్కటి తేడాగా ఉన్నా మనం నకిలీ మందుని కొన్నామని అర్థం. అలా వారు పంపిన వివరాలతో గనక సరిపోలనట్టైతే తిరిగి అదే మెసేజ్ ని రిప్లైగా పంపినట్టయితే. ఆ విషయం కంప్లైంట్ గా నమోదవుతుంది.