నాగ చైతన్య ఆస్తుల విలువ ఏంతో తెలుసా?
Naga chaitanya assets :అక్కినేని నాగార్జున నటవారసునిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య , తనతో కల్సి నటించిన సమంతను ప్రేమించి, పెద్దల అంగీకారంతో మూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత సినిమాల్లో మరింత బిజీ అయ్యాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సాయిపల్లవితో కల్సి లవ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు.
అలాగే , విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో థాంక్యూ మూవీలో నటిస్తున్నాడు. జోష్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి, తన నటనతో ఆకట్టుకుని, 100%లవ్, ఏం మాయ చేసావే, తడాఖా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, మనం, మజిలీ ఇలా పలు సినిమాలతో తన ఇమేజ్ పెంచుకున్నాడు.
తండ్రి వారసత్వం నుంచి వందల కోట్ల ఆస్తిని పొందాడని టాక్. ఇక సమంత కూడా 80కోట్ల వరకూ సంపాదించిందని అంటున్నారు. అయితే సినిమాల్లో నటించడం ద్వారా దాదాపు 40కోట్లు ఇప్పటి దాకా సంపాదించినట్లు టాక్.