ఈ నటుడు గుర్తు ఉన్నాడా…ఎంత మందికి జీవితం ఇస్తున్నాడో తెలుసా?
Gv Narayana rao :సినిమాల్లో ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం కూడా కల్సి రావాలి. లేకుంటే కిందికి పడిపోతాం. దశ తిరిగితే ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇక కొందరికి పూలపాన్పు లా ఇండస్ట్రీ ఉంటె, మరికొందరికి ఎండమావిగా ఉంటుంది. కష్టం లేకుండానే ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకున్న వాళ్లలో నటుడు నారాయణరావు ఒకరు. ఈయన అసలు పేరు జివి నారాయణరావు.
సారధి స్టూడియోస్, అక్కినేని సినిమాలు పంపిణీ చేసిన నవయుగ ఫిలిమ్స్ అధినేత కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నారాయణరావు మెహబూబా కాలేజీలో చదువుతూ రవీంద్ర భారతిలో నాటకాలు వేసేవారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈయనతో కల్సి నటనలో శిక్షణ తీసుకున్నారట. కె బాలచందర్ డైరెక్ట్ చేసిన అంతులేని కథ మూవీలో రజనీకాంత్, నారాయణరావు లను తీసుకున్నారు.
ఆ సినిమాలో నటనకు నారాయణరావుకు అవార్డు వచ్చింది. తరవాత చిలకమ్మా చెప్పింది మూవీలో రజనీకాంత్ తో కల్సి నటించగా, ఏడు అవార్డులు వచ్చాయి. ఈ మూవీలో నారాయణరావుకి 1500పారితోషికం అండగా, రజనీకి 1000రూపాయలు ఇచ్చారు. అయితే ఆతర్వాత నారాయణరావు కి ఛాన్స్ లు తగ్గిపోవడంతో సపోర్టింగ్ ఆర్టిస్టు గా మారిపోయి, సినిమాలతో పాటు సీరియల్స్ చేస్తున్నారు. సీరియల్స్ నిర్మాణం కూడా చేస్తున్నారు. రజనీ మాత్రం సూపర్ స్టార్ అయ్యారు.