మనసిచ్చి చూడు సీరియల్ రేణు ఎన్ని సినిమాల్లో నటించిందో ?
Manasichi choodu serial renu :బుల్లితెర మీద తెలుగు ఆడియన్స్ ని విశేషంగా అలరిస్తున్న ప్రముఖ మనసిచ్చిచూడు సీరియల్ బాగా క్రేజ్ కూడా సంపాదించుకుంది. ఇక ఇందులో నటీనటులు తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా భానుకి చెల్లెలుగా నటిస్తున్న రేణు మనకు బాగా పరిచయం అయిన అమ్మాయే.
సినిమాల్లో బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో చేసిన రేణు అసలు పేరు త్రిష దంతాల. ఆగస్టు 1న హైదరాబాద్ లో పుట్టిన ఈమె కు ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడమే కాదు, డాన్స్ చేయడం కూడా ఇష్టమే. స్టార్ మా వంటి వాటిలో డాన్స్ చేసి, తన టాలెంట్ చూపించింది.చక్రవాకం సీరియల్ తో చైల్డ్ ఆర్టిస్టుగా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన త్రిష ఆతర్వాత ప్రేమ, సావిత్రమ్మగారి అబ్బాయి, వంటి సీరియల్స్ లో చేసింది.
చక్కిలిగింత, అల్లు అర్జున్ నటించిన ఐ యామ్ ద చేంజ్ వంటి మూవీస్ లో నటించింది. ప్రస్తుతం మనసిచ్చి చూడు సీరియల్ లో తన నటనతో ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటోంది. భాను, పార్వతి, లతో కల్సి త్రిష సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఖాళీ సమయాల్లో చేసే డాన్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి, అభిమానులకు వినోదం పంచుతున్నారు.