Devotional

పోలి స్వర్గం ఎప్పుడు డిసెంబర్ 15 ? 16 ? దీపాలు ఏ రోజు వదలాలి

poli swargam 2020 date :ఈ సంవత్సరం పోలి స్వర్గం అంటే పోలి పాడ్యమి అనేది ఎప్పుడు జరుపుకోవాలి అనే సందేహం వచ్చింది అంటే డిసెంబర్ 15 లేదా డిసెంబర్ 16వ తేదీన ఎప్పుడు చేయాలి అనేది ప్రతి ఒక్కరిలోనూ సందేహం ఉంది. కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేస్తారు ఆ తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున అరటి దొప్పలలో 31 వత్తులను వెలిగించి పారే నీటిలో వదులుతారు. ఈ దీపాలను కార్తీక దీపాలుగా ఉద్వాసన చెబుతూ పోలి స్వర్గం లేదా పోలి పాఢ్యమి అని అంటారు. అయితే ఈ సంవత్సరం అమావాస్య సోమవారం వచ్చింది పాడ్యమి మంగళవారం వచ్చింది.పాడ్యమి రోజు ఉద్వాసన చెప్పాలి కాబట్టి పాడ్యమి మంగళవారం రావటంతో మంగళవారం నాడు చేయవచ్చా లేదా అనే సందేహం వచ్చింది. మంగళవారం రోజు పాఢ్యమి ఉంది కాబట్టి ఆరోజు దీపాలను ఉద్వాసన పలకవచ్చు. సూర్యోదయానికి ముందే దీపాలను నదులు చెరువులు కాలువలు అందుబాటులో లేని వారు పెద్ద పళ్ళెంలో నీటిని పోసి వాడొచ్చు. తులసి కోట ముందు చేయాలి.

పళ్ళెం పెట్టి అందులో నీరు పోసి పువ్వులు అందులో వేసి గంగా దేవికి నమస్కారం చేసి గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని శ్లోకం చదువుకోవాలి. దీపాలను ఈ పళ్లెంలో వదలండి, దీపాలను ముందుకు నెడుతున్నట్టుగా మూడు సార్లు అంటే పోలిని సాగనంపుతూ ఉన్నట్లుగా అర్థం వస్తుంది.

ఆ తరువాత పోలి స్వర్గానికి వెళ్లే కథ చెప్పుకోవాలి లేదా వినాలి ఆ తర్వాత ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి ఇక దీపాలుకొండెక్కాకా ఆ నీటిని చెట్టుకు పోయండి. పువ్వులు ఎవరూ తొక్కని ప్రదేశములో వేయండి. కాబట్టి ఈ నెల 15వ తేదీ మార్గశిర శుద్ధ పాడ్యమి మంగళవారం రోజు ఉదయం సూర్యోదయానికి ముందే ఇలా దీపాలను వదిలి కార్తీక ఉద్యసన పలికి కార్తీకదీపం ఫలితాన్ని అందరూ పొందండి.