MoviesTollywood news in telugu

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన భామలు Part-2

Family Background heroines 2 :టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజులను హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించాలనుకుంటే ఫాన్స్ ఒప్పుకోకపోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ తరవాత షో సినిమాలో నటించి, తర్వాత ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ కి అక్కగా చేసింది. ఏం మాయ చేసావే సినిమాకి నిర్మాత గా వ్యవహరించింది. తర్వాత మనసుకు నచ్చింది సినిమాతో దర్శకత్వంలో కూడా అడుగుపెట్టింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు లక్ష్మీప్రసన్న ముందు ఇంగ్లీష్ లో కొన్ని సినిమాలు సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత తెలుగులో టాక్ షో కాన్సెప్ట్ ని పరిచయం చేసింది. బాలనటిగా మోహన్ బాబు నటించిన పద్మవ్యూహం సినిమాలో నటించింది. యాక్టర్ గా అనగనగా ఒక ధీరుడు మూవీ చేసి, తర్వాత ఎన్నో సినిమాలు చేసింది. వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇప్పుడు నిర్మాతగా మారి ఎన్నో సినిమాలు, షోలు నిర్మిస్తూ నటన కూడా సాగిస్తోంది.

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మొట్టమొదటి నటి నిహారిక కొణిదెల. నాగబాబు కూతురు నిహారిక ఢీ ప్రోగ్రామ్ తో యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత ముద్ద పప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్ లో చేసింది. ఒక మనసు సినిమాతో బిగ్ స్క్రీన్ మీద కనిపించి, తర్వాత నాన్న కూచి అనే వెబ్ సిరీస్, సూర్యకాంతం సినిమా చేసింది. ఈ మధ్యనే నిర్మాతగా మారి మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ నిర్మించింది. దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయిన డాక్టర్ రాజశేఖర్ కూతురు శివాత్మిక ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో మరాఠీ లో హిట్ అయిన నటసామ్రాట్ రీమేక్ రంగ మార్తాండ లో నటిస్తోంది. మరో కూతురు శివానీ మొదటి చిత్రం అడవి శేష్ తో టూ స్టేట్స్ తెలుగు రీమేక్ లో నటిస్తుండగా, కొన్ని కారణాలవల్ల సినిమా మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు పెళ్లి గోల వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన మల్లిక్ రామ్ దర్శకత్వంలో సినిమా చేయబోతోంది.

తమిళ నటుడు విజయ్ కుమార్, మంజుల కూతుళ్లు ప్రీతి, శ్రీదేవి, వనిత కూడా సినిమాల్లో నటించారు. రుక్మిణి, ప్రియమైన నీకు లాంటి ఎన్నో సినిమాల్లో ప్రీతి నటించింది. ఈశ్వర్, వీర సినిమాల్లో శ్రీదేవి నటించింది. దేవి సినిమాలో సహాయ పాత్ర వనిత పోషించింది. తర్వాత తమిళ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వచ్చింది. హీరో శరత్ కుమార్ మొదటి భార్య కూతురు వరలక్ష్మి కూడా పొడా పోడి సినిమాతో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి, తమిళ్, తెలుగు చిత్రాలలో ఎన్నో ముఖ్య పాత్రలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు తమిళ్ కన్నడ సినిమాల్లో ఎన్నో ముఖ్య పాత్రలు పోషించిన అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఇప్పుడు తమిళ సినిమాల్లో నటిస్తోంది.

విద్యుల్లేఖ తన అసలు పేరు కంటే బుజ్జిమా పేరుతో ఎక్కువ ఫేమస్ అయింది. తన తండ్రి మోహన్ రామన్ తమిళ్ లో ఎంతో పేరుపొందిన నటులు. డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసే ఉంటారు. విద్యుల్లేఖ అటు తమిళ ఇటు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. అమృత సినిమాలో అమృత పాత్ర పోషించిన కీర్తన ఎవరో కాదు, కీర్తన సీత, పార్తీబన్ ల కూతురు. సీత ఎన్నో తెలుగు తమిళ సినిమాల్లో చేసి, సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రల్లో నటించారు. అలాగే పార్తీబన్ కూడా ఎన్నో తమిళ సినిమాల్లో నటించారు. అమృత సినిమా లో తను పోషించిన పాత్రకి కీర్తన జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకుంది. చైల్డ్ ఆర్టిస్టుగా చిత్రం సినిమాలో చేతన నటించి, కుక్క కావాలి అని గొడవ చేసింది. ఎన్నో సినిమాల్లో ముఖ్యంగా కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కచ్చితంగా ముఖ్య పాత్ర పోషించిన ఉత్తేజ్ కూతురు చేతన ఈ మధ్యనే పిచ్చిగా నచ్చావ్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఐశ్వర్య రాజేష్ (రాజేష్) , ఆలియా భట్ (మహేష్ భట్), కాజోల్, తనీషా (తనూజ), ఐశ్వర్య (లక్ష్మి), ఇలా చాలామంది బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు.