BusinessPoliticsToday gold rate

గల్ఫ్ దేశాల నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు..?

Gold weight :విదేశాల్లో ఏడాది పాటు ఉన్న వ్యక్తి రూ.50 వేల ఖరీదు చేసే బంగారు ఆభరణాలను తీసుకురావచ్చు. మహిళలైతే రూ.లక్ష విలువ చేసే ఆభరణాలను తీసుకొచ్చినా డ్యూటీ ఫ్రీగా పరిగణిస్తారు. అయితే, వాటిని కడ్డీల రూపంలో తీసుకురావడం నిషేధం. అలాగే ఆరు నెలల పాటు విదేశాల్లో ఉన్న ప్రయాణికులు ఆ సమయంలో ఉండే గోల్డ్ టారీఫ్ మీద 10.3 శాతం కస్టమ్స్ డ్యూటీ ఫీజు చెల్లించి, కేజీ బంగారం తీసుకువచ్చే అనుమతి ఉంటుంది. ఇలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా కస్టమ్స్‌కు ఇచ్చిన డిక్లరేషన్ కన్నా ఎక్కువగా బంగారాన్ని తీసుకొస్తే వాటిపై 36.05 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అదే విధంగా 3 రోజుల పాటు విదేశాల్లో ఉండి నగరానికి వచ్చే ప్రయాణికులు డ్యూటీ ఫ్రీ కింద రూ.45 వేల విలువ చేసే సామగ్రిని తీసుకురావచ్చు. ఎలక్ట్రానిక్ వస్తువులు తెస్తే వాటిపై అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. 18 ఏళ్లు నిండిన వారు ఒక లాప్‌టాప్‌ను డ్యూటీ ఫ్రీ కింద తీసుకురావచ్చు. ప్రతి ప్రయాణికుడు రెండు లీటర్ల విదేశీ మద్యాన్ని డ్యూటీ ఫ్రీ కింద తెచ్చుకోవచ్చని అధికారులు చెప్పుతున్నారు.