karthika deepam today episodeMovies

కార్తీకదీపం సీరియల్… గాడి తప్పుతోందా..?

Karthika deepam serial : స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గాడి తప్పుతుందా అంటే కొన్ని సన్నివేశాలను చూస్తే అలానే అనిపిస్తుంది. ఈ సీరియల్ బిగ్ బాస్ ని మించి రేటింగ్ లో దూసుకుపోయి నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ సీరియల్కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాగే విమర్శలు చేసేవారు కూడా ఉన్నారు. ఆ విమర్శలు గురించి ఒకసారి చూద్దాం. కార్తీకదీపం సీరియల్ 1000 ఎపిసోడ్ లకు దగ్గరలో ఉంది. ఒక్క DNA టెస్టుతో కథ చెప్పటానికి బదులు ఇన్ని ట్విస్టులు అవసరమా అని అనే వారు చాలా మంది ఉన్నారు. అలాగే కార్తీకదీపం అభిమానులు కూడా సీరియల్ లో లాజిక్ మిస్ అవుతుంది అని కదా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉందని అంటున్నారు.

కథ సాఫీగా సాగుతూ భావోద్వేగంతో కూడిన ట్విస్టు ఉంటూ ఒకప్పుడు ఆసక్తికరంగా సాగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ మార్క్ సన్నివేశాలు తగ్గాయని చెప్పాలి. హిమ తన తల్లిని చూపించాలి అని అన్నప్పుడు డాక్టర్ బాబు సరే అని అంటాడు. అప్పుడు డాక్టర్ బాబు పెద్ద పార్టీ ఏర్పాటు చేసి తన లవర్ ఫోటో చూపించి మీ అమ్మ అని చెప్పి చనిపోయింది అని అంటాడు ఈ సీన్ అందరికీ బాగా గుర్తుండిపోయింది. ఆ పార్టీ తర్వాత వంటలక్క కనిపించకుండా పోయింది. అప్పుడు అది సీరియల్ లో ట్విస్ట్ కాకుండా తెలుగు రాష్ట్రాల్లోే అయ్యో వంటలక్క కనిపించకుండా పోయింది అని తెగ హడావిడి చేశారు. అప్పుడే సౌర్య కార్తీక్ ని నాన్న అని పిలవడం నీవే మా నాన్న అని చెప్పడం జరిగింది. ఇక అటువంటి ట్విస్టులు మార్పులు చేర్పులు వస్తే కానీ కార్తీకదీపం అభిమానులు నిరాశ నుంచి బయట పడతారు.