నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతున్న ఉప్పెన…ఎప్పుడో తెలుసా?
uppena movie release date : దేనికైనా టైం రావాలని అంటారు. అది నిజమేనని సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ ని చూస్తే అనిపిస్తుంది. మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చారు. కానీ వైష్ణవ్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్న వైష్ణవ్ తేజ్ ‘ ఉప్పెన’ మూవీ చేసాడు. కానీ ఇప్పటివరకూ రిలీజ్ కి నోచుకోని ఈ మూవీని మరోసారి బ్యాడ్ లక్ వెంటాడుతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ ప్రొడక్షన్ లో ఆయన శిష్యుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో సమ్మర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు.
నీ కన్ను నీలి సముద్రం సాంగ్ తోనే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇటీవల ఆ లిరికల్ సాంగ్ 100మిలియన్స్ వ్యూవ్స్ వచ్చాయి. సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఈలోగా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో పాటు, థియేటర్లు మూతపడ్డాయి. దాంతో ఊహించని విధంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో మూవీస్ రిలీజ్ చేశారు. కానీ ఉప్పెన అలా రిలీజ్ చేస్తారన్న టాక్ నడిచింది.
సినిమా హక్కుల కోసం ఓటీటీ సంస్థలు కూడా ట్రై చేసినా సరే, వైష్ణవ్ తేజ్ కెరీర్ మొదటి సినిమా కాబట్టి డైరెక్ట్ థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. ఇక థియేటర్స్ కి అనుమతులు వచ్చినా సరే, అక్కడక్కడా తెరిచారు తప్ప, ఇంకా పూర్తిగా తెరవలేదు. ఇక సంక్రాంతి సీజన్ లోనే సినిమాను విడుదల చేయాలని అనుకుంటే, సంక్రాంతికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కూడా వస్తుందని అంటున్నారు. అలాంటి టైమ్ లో రిస్క్ చేయకూడదని మార్చి నెలలో విడుదల చేయాలని అనుకుంటున్నారట.కానీ ఇప్పుడు మనస్సు మార్చుకొని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.ఈ సినిమాని ఏకంగా 18 కోట్లతో నిర్మించారు.
ఈ నేపధ్యంలో ప్రముఖ ఓటీటీ ఛానల్స్ తో ఇన్ని రోజులు చర్చలు నడిచాయి.అయితే ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మాతలు చెప్పిన అమౌంట్ ఇవ్వడానికి ఒకే చెప్పడంతో ఆ అఫీషియల్ గా ఆ ఛానల్ కి సినిమా రైట్స్ ఇచ్చేశారు.దీంతో సదరు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఉప్పెన రిలీజ్ పై అఫీషియల్ అప్డేట్ ఇచ్చింది.అయితే ఎప్పుడు రిలీజ్ చేయబోయేది డేట్ మాత్రంఇంకా ఎనౌన్స్ చేయలేదు.