రజనీని హెచ్చరించిన స్టార్ హీరో తండ్రి…ఎవరో తెలుసా?
Rajinikanth Movies :రాజకీయ పార్టీ ప్రకటన చేస్తానని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించాక ఆయనపై ఫోకస్ పెరిగింది. రజనీకాంత్ జీవితంలో దాపరికం అనేది కన్పించదు. ఎందుకంటే, మద్యపానం, ధూమపాన అలవాట్ల గురించి అతను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి రహస్యంగా దాచుకోలేదు. తనకు చెడు అలవాట్లు ఉన్నప్పటికీ తన స్నేహితుడైన బహుముఖ నటుడు శివకుమార్ ఏనాడూ తన స్నేహితుడు రజనీకాంత్ ను వదులుకోలేదు. పైగా తలైవర్ ను తన వ్యసనాన్ని వదులుకోవాలని ఒప్పించాడు. శివకుమార్ సలహాను పాటిస్తే ఎవరైనా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటరని రజనీ తలచుకున్నారు.
రజనీకాంత్ 1977 లో కవికుయిల్, భువానా ఓరు కెల్వికురి అనే రెండు మూవీస్ లో నటించగా, అందులో శివకుమార్ కీలక పాత్రలు పోషించారు. “అతను మంచి మనిషి.. నిజాయితీపరుడు. ఆయన మాటలు నిజమయ్యాయి. నా అలవాట్లు నా ఆరోగ్యాన్ని పాడుచేసాయి. నేను స్టార్ గా సినిమాల్లో ఎదగగలిగాను” అంటూ రజనీ ఓసారి జ్ఞాపకాల్లోకి వెళ్లారు. ‘నేను గతంలో అతనితో సినిమాల్లో పనిచేయడం వల్ల కొన్ని అమూల్యమైన జీవిత పాఠాలు నేర్చుకున్నాను“ అని రజనీకాంత్ ఓ లేఖలో పేర్కొన్నారు. “నేను మద్యపానం ధూమపానానికి బానిస అయిన సమయంలో.. నువ్వు గొప్ప నటుడిని అవుతావు.. ఈ అలవాట్లతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని శివకుమార్ నాకు సలహా ఇచ్చేవాడు“ అని రజనీ అందులో చెప్పుకొచ్చారు.
నిజానికి శివకుమార్ మంచి చిత్రలేఖనం కళాకారుడు. 1958 నుండి 1965 వరకు వేసిన శివకుమార్ 100 పెయింటింగ్ లు ఎంతో పాపులరయ్యాయి. భారతదేశం లోని చాలా ముఖ్య ప్రదేశాలలో అతడి పెయింటింగ్స్ కొలువుదీరి ఉన్నాయి. అయితే శివకుమార్ తన గ్రామం నుండి కళారంగంపై ఆసక్తితో చెన్నైకి వెళ్లారు. అయితే విధి అతడి ఆలోచనను మార్చేసింది. చిత్రలేఖన కళాకారుడు అవ్వాలనుకుంటే, అనుకోకుండా నటుడు అయ్యారు. అతను 1965 చిత్రం కక్కుం కరంగల్ లో ఒక చిన్న పాత్రతో తమిళ పరిశ్రమలో అడుగుపెట్టాడు. వివిధ పాత్రలతో తనదైన ముద్ర వేసాడు. బహుముఖ ప్రజ్ఞావంతుదిగా నిలిచారు. కాగా నవతరం హీరోలు సూర్య, కార్తీల తండ్రి శివకుమార్ అనే సంగతి తెల్సిందే.