MoviesTollywood news in telugu

బాగా ఫేమస్ అయినా ఈ రోల్స్ ఎందుకు వదులుకున్నారో తెలుసా?

Tollywood Famous Roles :ఏ పాత్ర ఎవరికి రాసిపెట్టి ఉందొ చెప్పడం కష్టం. ఫలానా హీరో, హీరోయిన్ దృష్టిలో పెట్టుకుని కథ అనుకున్నా, చివరకి వేరేవాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. తీరా ఆసినిమా హిట్ అయితే అయ్యో చేజారిందే అనే బాధ ఉండిపోతుంది. అలాంటివాటిలో కొన్నింటిని ప్రస్తావిస్తే, 16ఏళ్ల వయస్సు మూవీ శ్రీదేవి సరసన చంద్రమోహన్ చేశారు. అయితే తమిళంలో కమల్ వేసిన ఈ పాత్రను తెలుగులో శోభన్ బాబు వేయాలని అనుకున్నా, డీ గ్రామర్ అవుతుందని చెప్పడంతో వెనకడుగు వేశారు. దాంతో చంద్రమోహన్ సెట్ అయ్యాడు.

సితార మూవీ ని డైరెక్టర్ వంశి తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రాధను అనుకున్నారట. అప్పటికే తమిళంలో ఫేమస్ హీరోయిన్ గా ఉంటూ, తెలుగులోనూ రాణిస్తోంది. కానీ రెమ్యునరేషన్ ఎక్కువ అడగడంతో మరో హీరోయిన్ ని చూడాలని భావించడంతో భానుప్రియ చేతికి వెళ్లి సూపర్ హిట్ అయింది. ఇక అహనా పెళ్ళంట మూవీని హాస్య బ్రహ్మ జంధ్యాల తెరకెక్కించగా, సూపర్ హిట్ అయింది. ఇందులో కోట శ్రీనివాసరావు వేసిన పాత్రకోసం రావుగోపాలరావు ని అనుకుంటే, ఆ సీన్ తనకు సెట్ కాదని భావించడంతో కోట రంగంలోకి వచ్చి, కెరీర్ లో మైలురాయిగా మలుచుకున్నారు.

నాగార్జున ట్విన్స్ గా నటించిన హలోబ్రదర్ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ లో ఒక రోల్ కోసం రోజాను అనుకున్నారు. అయితే సొంత సినిమా సమరం మూవీ తో బిజీగా ఉండడం వలన వదిలేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్నీ ఓ ఇంటర్యూలో స్వయంగా రోజా చెప్పుకొచ్చారు. ఇక స్వాతికిరణం తర్వాత తెలుగులో ముమ్ముట్టి ఎన్ని ఛాన్సులు వచ్చినా చేయలేదు. ప్రస్థానం మూవీకోసం అడిగితె కాదనడంతో సాయికుమార్ కి వెళ్ళింది. ఇక పాదయాత్ర మూవీలో వైస్సార్ పాత్రతో ఎన్నికల ముందు సినిమాలో ముమ్ముట్టి మెరిశాడు.