బ్రహ్మనందం రెండో కొడుకు ఏమి చేస్తున్నాడో తెలుసా ?
Brahmanandam second son :టాలీవుడ్ లో సినీ నటులు తమ వారసులను పరిచయం చేసినప్పటికీ కొంతమంది రాణించారు కొంతమంది ఇంకా కష్టపడుతూ ముందుకు సాగుతున్నారు.మూడు దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్న బ్రహ్మానందం గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. బ్రహ్మానందంనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దకొడుకు గౌతమ్ హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “పల్లకిలో పెళ్లికూతురు” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
తర్వాత వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకోలేక హీరోగా రాణించలేకపోయాడు. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇక రెండో కొడుకు విషయానికి వస్తే…అతడి పేరు సిద్ధార్థ కన్నెగంటి. సిద్ధార్థ ఇటీవలే విదేశాలలో చదువు ముగించుకొని వచ్చాడు. అందువల్ల సినీ పరిశ్రమకు ఇప్పటివరకు దూరంగానే ఉన్నాడు. టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం కాబోతున్నాడని కొందరు చర్చించుకుంటున్నారు.కానీ సిద్ధార్థ మాత్రం వ్యాపార రంగంలో రాణించేందుకు ఆసక్తి చూపుతున్నాడట.