2020 లో పెళ్లి చేసుకున్న సెలబ్రేటీస్ ఎవరో ఒక లుక్ వేయండి
Tollywood celebrities marriages 2020 :ఈ ఏడాది మహమ్మారి కరోనా దెబ్బకు అన్ని రంగాలు మూతబడిన విధంగానే సినిమా రంగం దెబ్బతింది. షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్లు మూతపడడంతో కార్మికులు పనుల్లేక నష్టపోయారు. ఇక సినిమాల్లో పెట్టుబడులు పెట్టి, రిలీజ్ కాకుండా, మధ్యలో ఆగిపోయి, నష్టాలూ చవిచూశారు. అయితే ఈ సమయంలో కొందరు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో పెద్దలు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం పరిమిత సంఖ్య మధ్య హీరో నిఖిల్ మే 14న తన ప్రియురాలు పల్లవి వర్మ మెడలో మూడు ముళ్ళు వేసాడు.
ఇక హీరో నితిన్ తాను ప్రేమించిన షాలినిని పెద్దల అంగీకారంతో వాళ్ళ సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు. జులై 26న హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలస్ లో జరిగిన ఈ వేడుకకు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, తెలంగాణ మంత్రులు హాజరయ్యారు. ఇక మోస్ట్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా ఆగస్టు 8న తన ప్రియురాలు మినికా బజాజ్ కి పెద్దల అంగీకారంతో , అందరి సమక్షంలో మూడు ముళ్ళు వేసాడు. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు 30మంది అతిధులు మాత్రమే వచ్చారు. ఇక నిర్మాత దిల్ రాజు భార్య మరణించడంతో చాలాకాలం ఒంటరిగా ఉన్నాడు. అయితే హైదరాబాద్ కి చెందిన తేజస్వినిని మే 10న నిజామాబాద్ జిల్లా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా పెళ్లిచేసుకున్నాడు.
ఇక టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న తన ప్రియుడు గౌతమ్ మీనన్ ని పెళ్లి చేసుకుంది. ముంబైలో వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. జబర్దస్త్ మహేష్ కూడా లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్నాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇక డిసెంబర్ 9రాత్ర్రి మెగా డాటర్ నిహారిక పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉదయ్ విలాస్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది.