MoviesTollywood news in telugu

సినిమా విడుదల కాకుండానే ఎన్ని ఛాన్స్ లు వచ్చాయో తెలిస్తే షాక్…?

Telugu Actress Krithi Shetty :ఒక్కొక్కరి అదృష్టం ఇలాగే ఉంటుంది. లేకపోతె ఇంకా సినిమా రిలీజ్ కాకుండానే ఆ హీరోయిన్ కి వరుస పెట్టి ఛాన్సులు వచ్చేస్తున్నాయి. అవును, సాయిధరమ్ తేజ్ బ్రదర్ వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ తీసిన ఉప్పెన మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. షూటింగ్ పూర్తయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా థియేటర్లు లేకపోవడంతో రిలీజ్ కి నోచుకోలేదు.

ఇప్పటికీ అక్కడక్కడా థియేటర్లు తీస్తున్నా, పూర్తిస్థాయిలో తీయాలంటే ఇంకా సమయం పట్టేలా ఉంది. అయితే ఉప్పెన మూవీని థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ నిర్మాతలు డిసైడ్ అయ్యారు. దాంతో సినిమా రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే, ఇందులో హీరోయిన్ గా వేసిన కృతి శెట్టి కి మాత్రం నాలుగు సినిమాల్లో చేస్తోంది. కొన్ని కమిట్ కావాల్సి ఉంది.

ఉప్పెన మూవీలో క్యూట్ గా ఉండడం, స్టెప్స్ లో ఆకట్టుకోవడం వలన వరుస ఛాన్సులు వస్తున్నాయని, ఒకవేళ సినిమా రిలీజ్ అయివుంటే కూడా ఈమెకు ఇన్ని అవకాశాలు వచ్చేవి కాదని విశ్లేషకులు అంటున్నారు. లక్కు ఉండబట్టే ఈ అమ్మడు దూకుడుగా ఛాన్స్ లు కొట్టేస్తోందని అంటున్నారు.