వైరల్ ఫీవర్ ని దూరం చేసే నేచురల్ మెడిసిన్స్
viral fever remedies in telugu :చలి కాలం ప్రారంభం అయిందంటే వైరల్ ఫీవర్స్ విజృంభణ ప్రారంభం అవుతుంది. ఈ ఫీవర్స్ వచ్చాయంటే తొందరగా తగ్గవు. అలాగే ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వీటి నివారణకు నేచురల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
1. కొత్తిమీర
ఒక స్పూన్ కొత్తి మీర విత్తనాలను ఒక గ్లాను నీటిలో కలిపి మరిగించాలి. ఈ నీటిని వడకట్టి చల్లార్చాలి. చల్లారిన నీటిలో పాలు మరియు పంచదార కలపి తాగితే వైరల్ ఫీవర్ తగ్గుతుంది. కొత్తిమీర విత్తనాలలో ఉండే ఫైటోన్యూట్రియాంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తి ని పెంచుతుంది.
2. తులసి ఆకులు
రెండు లీటర్ల నీటిలో 40 తాజా తులసి ఆకులను, ఒక స్పూన్ లవంగాల పొడి వేసి నీరు సగం అయ్యేవరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి రెండు గంటలకు ఒకసారి త్రాగితే వైరల్ ఫీవర్ తగ్గుతుంది.
3. అల్లం
ఒక కప్పు నీటిలో అల్లం వేసి మరిగించి ఆ నీటిని రోజుకి 3 సార్లు త్రాగితే వైరల్ ఫీవర్ తగ్గుతుంది. అలాగే అల్లంను తేనేలో ముంచుకోని తిన్న మంచి ఫలితాలు కనబడతాయి.