ఈ హీరోని గుర్తు పట్టారా…టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు…ఎవరో ?
Music director koti son :ఒకప్పుడు సాలూరు రాజేశ్వరరావు అంటే మెలోడీ సాంగ్స్ కి పెట్టింది పేరు. ఆయన స్వర కల్పనలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు వచ్చాయి. ఇక ఆయన కొడుకు కోటేశ్వరరావు అలియాస్ కోటి కూడా రాజ్ తో కల్సి రాజ్ కోటిగా సినిమా ప్రపంచంలో ఓ ఊపు ఊపేసారు. ఇక రాజ్, కోటి విడిపోయాక కోటి సొంతంగా కూడా కొన్ని మూవీస్ చేసాడు.
కాగా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన అమ్మదొంగా మూవీకి మ్యూజిక్ అందించి ప్రస్థానం ప్రారంభించిన కోటి ఆతర్వాత చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున ఇలా చాలామంది మూవీస్ కి బాణీలు అందించాడు. ఇతడి కొడుకు హీరోగా చేసాడు. అతనెవరో కాదు రాజీవ్.
ఇక 2007లో ప్రముఖ దర్శకుడు చందు డైరెక్షన్ లో నోట్ బుక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో రాజీవ్ పెద్దగా నిలబడకపోయినా తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. తనీష్ హీరోగా చేసిన మూవీలో కూడా రాజీవ్ నటించాడు. ఇక హీరోగా, సపోర్టింగ్ హీరోగా కూడా పెద్దగా రాణించక పోవడంతో ఇప్పుడు సింగర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.