MoviesTollywood news in telugu

అడవి శేష్ జీవితంలో ఎన్నికష్టాలు పడ్డాడో తెలిస్తే అసలు నమ్మరు

Adivi Sesh: New Movie :చిన్న చిన్న రోల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన అడవి శేష్ రచయిత, దర్శకుడిగా కూడా ఎంట్రీ ఇస్తూ కర్మ మూవీ చేసాడు. తర్వాత నుంచి పంజా లో విలన్ గా చేసి, మంచి పేరు తెచ్చుకున్నాడు. బలుపు,వంటి సినిమాల్లో కీలక పాత్రలు వేసి, పేరు గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక బాహుబలి మూవీలో భద్ర పాత్ర కెరీర్ లో మలుపు తిప్పింది. ఆతర్వాత గూడచారి వంటి సినిమాలతో హీరోగా దూసుకెళ్తున్నాడు.

అడవి శేష్ అసలు పేరు సన్నీ చంద్ర. అతని తండ్రి ఓ డాక్టర్. ఇక చిన్ననాటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం పెంచుకున్న అడివి శేష్ సినిమాల్లోకి రాకముందు వెబ్ డిజైన్గ్ ద్వారా డబ్బులు సంపాదించేవాడు. అలా పోగేసిన సొమ్ముతోనే కర్మ మూవీ చేస్తే తీవ్రంగా నిరాశ పరిచింది.

మేజర్ ఉన్ని కృష్ణన్ నిజ జీవిత కథతో తీస్తున్న మేజర్ మూవీలో అడవి శేష్ నటిస్తున్నాడు. 60శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మీద భారీ అంచనా లున్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని అడివి శేష్ భావిస్తున్నాడు. ఫాన్స్ కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు