యాక్షన్ కింగ్ అర్జున్ ఇంటిలో ఎంతమంది నటులు ఉన్నారో తెలిస్తే షాక్
Arjun Unknown facts : ఒకప్పుడు యాక్షన్ కింగ్ అంటే అర్జున్ పేరే విన్పించేది. అర్జున్ 1964 ఆగస్టు 15న కర్ణాటకలో జన్మించిన అర్జున్ అసలు పేరు శ్రీనివాస షార్జా . ఇతని ఫామిలీ మొత్తం ఇండస్ట్రీలో నటులుగా, డైరెక్టర్స్, హీరోయిన్స్ గా వెలిగినవాళ్ళే. అర్జున్ తండ్రి శక్తిప్రసాద్ ఇండస్ట్రీలో ఫేమస్ విలన్ గా పేరుతెచ్చుకున్నారు. అర్జున్ కి పిల్లనిచ్చిన మామ రాజేష్ కూడా యాక్టర్ కావడం విశేషం. అర్జున్ భార్య కూడా ఒకప్పుడు కన్నడ లో ఫేమస్ హీరోయిన్.
అర్జున్ అన్నయ్య కిషోర్ షార్జా కన్నడలో ఫేమస్ డైరెక్టర్. తీసింది 6సినిమాలు అయినా అన్నీ హిట్టే. ఇప్పుడు అర్జున్ కూతుళ్లు కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అనేకాదు, . అర్జున్ మేనల్లుళ్లు ముగ్గురూ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నారు. అందులో ఓ మేనల్లుడైన చిరంజీవి షార్జా పందెం కోడి మూవీని కన్నడలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఈయన 2020జూన్ 6న సడన్ గా శ్వాసకోశ ఇబ్బంది వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. అతడి భార్య మేఘనరాజ్ ఫేమస్ హీరోయిన్ గా చేసింది.ఈమె తెలుగులో సైతం నటించింద.
కాగా మా పల్లెలో గోపాలుడు, పుట్టింటికి రా చెల్లి వంటి సెంటిమెంట్ మూవీస్ తో అర్జున్ ఫామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఇక జెంటిల్ మ్యాన్, ఒకే ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ మాస్ మూవీస్ తో అలరించిన అర్జున్ విభిన్న రోల్స్ తో ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన శ్రీ మంజునాథ మూవీలో నాస్తికుడుగా, భక్తుడిగా విభిన్న మనస్తత్వాలతో అలరించాడు. శ్రీ ఆంజనేయం మూవీలో నితిన్ తో కల్సి నటించాడు. ఇక విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో చేసాడు