MoviesTollywood news in telugu

హీరో వేణు గుర్తు ఉన్నాడా…వేణు భార్య ఏమి చేస్తుందో తెలుసా ?

Venu Wife Details : స్వయంవరం, మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి, బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు, అందరి దృష్టిని ఆకర్షించిన హీరో వేణు నిజంగా ఆరు అడుగుల బులెట్ లానే ఉంటాడు. ఇక ఈ సినిమాలో టివి టవర్ అని సంబోదిస్తూ డైలాగులు కూడా ఉంటాయి. ఆతర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే , గోపి గోపిక గోదావరి ఇలా ఎన్నో హిట్ మూవీస్ చేసిన వేణు ఎంత వేగంగా వచ్చాడో అంతేవేగంగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు.

నిజానికి 2006లోనే సినిమాలకు దూరం జరిగిన వేణు ఆతర్వాత జూనియర్ ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన దమ్ము మూవీలో కీలక పాత్ర వేసాడు. తర్వాత రామాచారి మూవీ చేసి, డిజాస్టర్ కావడంతో పూర్తిగా సినిమా రంగానికి దూరం జరిగాడు. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా, 2001లోనే అనుపమ చౌదరి అనే బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో ఎం బి ఏ చేసి, ఇంటీరియర్ డిజైనింగ్ పూర్తిచేసింది.

పెళ్లయినప్పటికీ అనుపమ మద్రాసులోనే బిజినెస్ రంగంలో కొనసాగుతూ దూసుకెళ్తోంది. దళసరి పేపర్లు తో చేసే ఆర్ట్ గా పిలవబడే వ్యాపారంలో ఆరితేరిన ఈమె ఈ రంగంలో రాణిస్తూనే, పెయింటింగ్ లో కూడా నిపుణుత సాధించి ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటుంది. ఆమె వెన్నంటి ఉంటూ అన్ని విషయాల్లో వేణు ముందుకి నడిపిస్తున్నారు. ఇక టి ఆర్ ఎస్ తరపున ఎన్నికల ప్రచారం చేసిన వేణుకు మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని అంటున్నారు.