కూర్చొన్న చోటే క్యాలరీలను ఖర్చు చేసే బెస్ట్ టిప్స్….
Weight Loss Tips :ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా ఇంచుమించు అందరూ డెస్క్ జాబ్స్ చేస్తున్నారు. వీరు ఎక్కువసేపు కూర్చోవటం వలన అధిక బరువు సమస్యతో ఇబ్బంది మరియు బాధపడుతున్నారు.
బరువు తగ్గాలంటే ఖచ్చితంగా కేలరీలు ఖర్చు కావాల్సిందే. అయితే కూర్చుంటే కేలరీలు ఎలా ఖర్చు అవుతాయా అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చెప్పే చిట్కాలను చూస్తే మీకే అర్ధం అవుతుంది.
1. చూయింగ్ గమ్ నమలడం వలన 10 కేలరీలు ఖర్చు అవుతాయి. అంతేకాక ఆహారం తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది.
2. వీలు ఉన్నంత వరకు ఎక్కువ నీటిని త్రాగటం వలన బరువు తగ్గుతారు.
3. కూర్చొని చేసే వ్యాయామాల మీద దృష్టి పెట్టాలి.
4. నలుగురితో నవ్వుతూ మాట్లాడితే మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకా కేలరీలు కూడా ఖర్చు అవుతాయి.
5. అరగంటకు ఒకసారి లేచి కొంత దూరం నడవటం అలవాటు చేసుకోవాలి. దీనివలన మెటబాలిజం రేటు కూడా మెరుగు అవుతుంది.
6. సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి.
7. బ్రీతింగ్ ట్రిక్స్ నేర్చుకోని చేస్తూ ఉండాలి.
8. హ్యండ్ గ్రిప్పర్స్ , ఫింగర్స్ ట్విస్ట్ వంటివి ప్రతి రోజు చేయాలి.
ఇవన్నీ చేస్తే కొంతవరకు మాత్రమే క్యాలరీలు ఖర్చు అవుతాయి. వీలు అయినంతవరకు ఎక్సర్ సైజ్ లు కూడా చేయటం మంచిది.
https://www.chaipakodi.com/