MoviesTollywood news in telugu

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?

Telugu actress Celina jailty : చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా చేసినా హిట్స్ రాకపోతే తెరమరుగు కావాల్సిందే. అయితే పెళ్లి చేసుకుని కొన్నాళ్ల గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే, కొంతవరకూ రాణిస్తున్నారు. అందులో ముఖ్యంగా మంచు విష్ణు హీరోగా వచ్చిన సూర్యం మూవీలో హీరోయిన్ గా చేసిన సెలీనా జైట్లీ ఒకరు.

ఈ అమ్మడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 20సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ హిట్స్ రాలేదు. దానికి తోడు టాలీవుడ్ కి చెందిన ఓ హీరో ప్రేమలో పడడం, ఆ విషయం సదరు తండ్రికి తెల్సి అది కాస్తా విఫలమవడం, పైగా ఆ హీరో తండ్రి హెచ్చరికతో టాలీవుడ్ ని వదిలేసి వెళ్లిపోయిందని అప్పట్లో వార్తలు షికారు చేసాయి.

అయితే ఈ అమ్మడు పీటర్ హాగ్ అనే వ్యక్తిని ప్రేమించి 2011లో పెళ్ళిచేసుకుని సినిమా రంగానికి పూర్తిగా దూరమైంది. ఇక బిజినెస్ రంగంలో బాగానే రాణిస్తున్న సెలీనా జైట్లీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కి ఒకే చెప్పింది. బాలీవుడ్ డైరెక్టర్ రామ్ కమల్ డైరెక్ట్ చేసిన సీజన్ గ్రీటింగ్స్ షార్ట్ ఫిలిం లో ప్రాధాన్యత గల పాత్రలో నటించింది. జి 5ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ మీద రిలీజ్ చేసారు. ఇది పెద్దగా ఆకట్టుకోక పోయినా, మరో బాలీవుడ్ డైరెక్టర్ సినిమాలో కీ రోల్ లో నటించే ఛాన్స్ దక్కించుకుంది.