MoviesTollywood news in telugu

ఈ హీరోని గుర్తు పట్టారా…అయితే వెంటనే చూసేయండి

Adivi Sesh Movies :కొన్ని సినిమాలతో కొందరు ఫామ్ లోకి వస్తారు. మరికొన్ని సినిమాల్లో చేసినా గుర్తుపట్టలేం. అలాగే అడవి శేష్ విషయంలో కూడా మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం అడివి శేష్ తాజాగా పెట్టిన చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో వావ్ అప్పట్లోనే నటించాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న మేజర్ మూవీలో చేస్తున్న అడివి శేష్ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగి తానేమిటో ప్రూవ్ చేసుంటున్నాడు. పంజా సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కల్సి నటించిన అడివి శేష్ అనగానే మనకు ఠక్కున మదిలో మెదులుతాడు. కానీ సొంతం మూవీలో కూడా చేసాడు.

గూఢచారి లాంటి మూవీస్ తో అడివి శేష్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. కర్మ, క్రిస్ వంటి మూవీస్ కి డైరెక్ట్ చేసాక, రైటర్ గా కొనసాగుతూ వచ్చాడు. కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ వేసాడు. అలాగే జక్కన్న తీసిన బాహుబలిలో కూడా నటించాడు. మేజర్ మూవీ త్వరలో థియేటర్లకు రానుంది.