MoviesTollywood news in telugu

పురాణ పాత్రల్లో ఒదిగిపోయిన స్టార్స్ …ఎంత మంది ఉన్నారో చూడండి

Mythological Characters :టాలీవుడ్ లో పురాణాల ఆధారంగా తీసిన చిత్రాలు జనాదదరణ బాగా పొందాయి. అయితే ఆహార్యం, వాచకం, అభినయం అన్నీ కల్సి ఉంటేనే పౌరాణిక పాత్రల్లో రాణిస్తారు. ఇందులో ఏది లేకున్నా ఆకట్టుకోవడం కష్టం. ఇక టాలీవుడ్ లో 1931లో వచ్చిన భక్త ప్రహ్లాద తొలి పౌరాణిక సినిమా. రామాయణం సీరియల్ వచ్చినా జనం ఆదరించారు. లాక్ డౌన్ సమయంలో ఇదే సీరియల్ పునః ప్రసారం చేస్తే, టాప్ రేటింగ్ వచ్చింది.

పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయిన వాళ్ళల్లో మొదటగా చెప్పాలంటే నందమూరి తారక రామారావు గురించి వివరించాలి. కృష్ణ్డుడు , రాముడు ఇలా ఏ పాత్ర తీసుకున్నా అచ్చం ఇలాగే ఉంటారని ఎన్టీఆర్ మరపించారు. అందుకే తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్య నటుడయ్యారు. అంతకుముందు ఈలపాట రఘురామయ్య నాటక రంగంలో , తరువాత సినిమాల్లో కృష్ణ పాత్రలో ఓ వెలుగు వెలిగారు. అయితే మాయా బజార్ లో ఎన్టీఆర్ కృష్ణుడు వేషం వేసాక అక్కడ నుంచి ఎన్టీఆర్ బాగా ఇమిడి పోయారు. కృష్ణుడు గెటప్స్ తో ఉన్న ఫోటోలు ఫాన్స్ తమ ఇళ్లల్లో పెట్టుకుని మురిసిపోయారు.

లవకుశ మూవీలో ఎన్టీఆర్ రాముడుగా నటించి మెప్పిస్తే, అంజలీదేవి సీతగా వేసి మురిపించారు. అందుకే తెలుగునాట సీత అనగానే అంజలీదేవి గుర్తొస్తారు. ఇక సత్యభామ పాత్రలో ‘మీర జరగలడా’ అంటూ కృష్ణుణ్ణి కొంగున ముడేసుకున్న గడసరి అనగానే జమున ఠక్కున గుర్తొస్తారు. శ్రీకష్ణ తులాభారం సినిమాలో సత్యభామ పాత్రలో ఒదిగిపోయి తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ఇక ఇదే సినిమాలో నారద పాత్రలో కాంతారావు నటన అనితర సాధ్యం. ఎందరో ఈ పాత్ర వేసినా కాంతారావు బాగా ఒదిగిపోయారు. ఇక శకుని పాత్రలో ధూళిపాళ సీతారామశాస్త్రి బాగా ఒదిగిపోయారు.