2020 లో OTT లో విడుదల అయిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…?
2020 ott release movies telugu :కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం లో అన్ని రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చాలా గట్టి దెబ్బ కొట్టింది. సినిమా థీయేటర్లు మూతపడ్డాయి. దీంతో వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. అయితే కొన్ని మూవీస్ ఓటిటి వేదికగా రిలీజయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతరామమ్’ జీ5 వేదికగా విడుదలై, ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోయింది.
ఇక ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` జూన్ 19న అమేజాన్ ప్రైమ్‌లో వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈసినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ ‘ఆహా’లో విడుదలై, యూత్‌ని మాత్రం బాగా ఆకట్టుకుంది. ‘భానుమతి రామకృష్ణ’ సినిమా ‘ఆహా’ వేదికగా విడుదలై యూత్‌ని మెప్పించింది. సత్యదేవ్ హీరోగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ‘ఆహా’ లో రిలీజ్ అయిన మరో చిత్రం జోహార్ మంచి విజయం అందుకుంది.
నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5న భారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై ప్లాప్ అయింది. అనుష్క నటించిన నిశ్శబ్ధం నిరాశ పరిచింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా ‘ఆహా’లో విడుదలై ఆకట్టు కుంది. ఆహాలో విడుదలైన ‘కలర్ ఫోటో’ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. కీర్తి సురేష్ నుంచి వచ్చిన మరో ఓటిటి సినిమా మిస్ ఇండియా మెప్పించింది. ‘గతం’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై, ఇండియన్ పనోరమాకు సెలెక్ట్ అయింది. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగానటించిన మిడిల్ క్లాస్ మెలొడీస్అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై, మంచి టాక్ తెచ్చుకుంది.