MoviesTollywood news in telugu

సుధా చంద్రన్ తెలుగులో నటించకపోవటానికి కారణం ఇదేనట

Sudha Chandran facts :నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన మయూరి మూవీలో నటించిన సుధాచంద్రన్ ఆ మూవీలో చేసిన నటనకు ఏకంగా ఆ మూవీకి 14నంది అవార్డులు వచ్చిపడ్డాయి. భారతీయ సినిమా చరిత్రలోనే ఈ మూవీకి ఓ విశిష్ట స్థానం ఉంది. 13వ సంవత్సరంలో ప్రమాదంలో కాలు పోగొట్టుకుని, కృతిమ కాలుతో డాన్స్ చేసి మెప్పించింది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితాన్ని తెరక్కించడంతో ఎక్కడలేని రెస్పాన్స్ వచ్చింది. అశేష ప్రేక్షకాదరణ లభించింది.

ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఇండియాలో ప్రదర్శనకు నోచుకున్న మయూరి మూవీ తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణాధ్యాయంగా నిల్చింది. అయితే ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాల్లో విలన్ వేషాలు వేసింది. మయూరితో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సుధా తర్వాత ఎన్నో భాషా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈమధ్య అలీతో జాలీగా షోలో పాల్గొన్న సుధా ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడించింది.

వచ్చేవారం ప్రసారమయ్యే ఈ షోలో పాల్గొన్న ప్రోమో రిలీజయింది. నిర్మాత రామోజీరావు మయూరి మూవీకి బ్లాంక్ చెక్ రాసిచ్చారని, ఇప్పటికీ తన బ్యాలెన్స్ తగ్గలేదని చెప్పింది. ఇక పొట్టకూటికోసమే విలన్ వేషాలు వేయాల్సి వచ్చిందని చెప్పింది. తనది ప్రేమ వివాహమని, ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పింది. సౌత్ ఇండియన్ కల్చర్ ఉండదని చెప్పారని, అయితే సౌత్ ఇండియన్ కల్చర్ లోపల ఉంటె, పంజాబీ లో అగ్రికల్చర్ ఉంటుందని తన భర్త చెప్పాడని ఆమె వివరించారు.