MoviesTollywood news in telugu

2020 లో దుమ్ము దులిపిన టాప్ సిరియల్స్ ఏమిటో చూడండి

Top TV Shows Of 2020 :వెండితెరకు ఏమాత్రం తీసిపోకుండా టివి సీరియల్స్ బుల్లి తెర ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇంట్లో ఉండేవాళ్ళకు మంచి కాలక్షేపంగా ఉండే ఈ సీరియల్స్ లో కొన్ని టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అందులో నటించే నటీనటులకు మంచి పేరు వస్తోంది. ఇక 2020లో బుల్లితెర ఆడియన్స్ ని కట్టిపడేసిన సీరియల్స్ విషయానికి వస్తే, మొదటగా గుర్తొచ్చేది కార్తీకదీపం సీరియల్. స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ విషయానికి వస్తే, ఫ్రెండ్ నాటిన అనుమాన బీజాన్ని గుర్తించలేని స్థితిలో డాక్టర్ కార్తీక్, ఆత్మగౌరవానికి కేరాఫ్ ఎడ్రెస్ వంటలక్క దీప మధ్య జరిగే కథ. ఇక కొడుకు, కోడలిని కలిపే అత్తగా సౌందర్య పాత్ర కూడా బాగా ఆకట్టు కుంటోంది. అందుకే చాలా ఏళ్లుగా ఎన్ని షోస్ వచ్చినా, రియాల్టీ షో వచ్చినా సరే, ఈ సీరియల్ టాప్ రేంజ్ లో నడుస్తోంది.

తర్వాత విషయానికి వస్తే, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ విపరీతంగా ఆకట్టు కుంటోంది. ఇంట్లో వాళ్ళకోసం ఎప్పుడూ తపించే ఓ భార్య, చదువులేకపోవడంతో విలువ ఇవ్వకపోవడం, భర్త గాడితప్పడం, వంటి ఘటనలతో ఆసక్తికరంగా నడుస్తోంది. తులసీగా నటి కస్తూరి అందరి మన్ననలు అందుకుంటోంది. ఇక స్టార్ మాలో వచ్చే వదినమ్మ సీరియల్ ఒకానొక సందర్భంలో కార్తీక దీపం కి మంచి పోటీ ఇచ్చింది. ప్రభాకర్, సుజిత, మధు రాయుడు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్కాచెల్లెళ్లు ఒకరిని ఇష్టపడితే అనే అంశంతో జీతెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ చాలామందిని ఆకట్టుకుంటోంది. మధ్య వయస్సులో ఉండే వ్యాపారి 16ఏళ్ళ ప్రేమలో పడడం ఇందులోని విశిష్టత.

ఇక సంగీతమే ప్రధానంగా బతుకుతున్న కోయిలమ్మ సీరియల్ లో కన్నతండ్రి సైతం ఆమెను దూరంగా పెడితే, అన్ని కష్టాలు అధిగమించి ఎలా నెగ్గుకొచ్చిందో చూపించారు. మహిళలను సమాజంలో అద్భుతంగా చూపించే సీరియల్ నెంబర్ వన్ కోడలు కూడా బాగా ఆకట్టుకుంటోంది. అత్తా కోడళ్ల మధ్య గల అసలైన అనుబంధా న్ని ఈ సీరియల్ లో కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. జి తెలుగులో వచ్చే ఈ సీరియల్ లో మయూరి సుధాచంద్రన్ కీలక పాత్ర పోషిస్తోంది