ఉదయ్ కిరణ్ మృతి పై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్
uday kiran :టాలీవుడ్ లో తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోగా ఎదిగి, లవర్ బాయ్ గా గుర్తింపు పొందిన ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవడం అప్పట్లో ఇండస్ట్రీలో కలకలం రేపింది. చిత్రం మూవీతో తేజ డైరెక్షన్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ వరుస హిట్స్ తో దూసుకెళ్లాడు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయం కృషితో ఎదిగిన ఉదయ్ కిరణ్ 2014జనవరి 5న ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి హ్యాట్రిక్ హిట్స్ తో ఎదిగిన ఉదయ్ మృతికి ఇండస్ట్రీలో అనేక కథనాలు వినిపిస్తుంటాయి. మనసంతా నువ్వే, శ్రీరామ్ మూవీస్ లో ఉదయ్ కిరణ్ హీరోగా చేసాడు.
ఈ మూవీస్ డైరెక్షన్ చేసిన వి ఎన్ ఆదిత్య ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ఉదయ్ ఆత్మహత్య గురించి సెన్షేషనల్ కామెంట్స్ చేసాడు. ఐదు రోజుల ముందు కూడా ఫోన్ లో మాట్లాడి, ఎన్నో విషయాలను పంచుకున్నాడని వివరించాడు. ఆర్ధిక కారణాలు, ఇంట్లో గొడవలు కారణం కాదని, కేవలం క్షణికావేశంలో మాత్రమే ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావిస్తున్నట్టు ఆదిత్య చెప్పాడు. మంచి నటుణ్ని మిస్సయ్యామని చెప్పాడు.