పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో స్వయంగా పాడిన పాటలు ఎన్ని…?
pawan kalyan songs :గతంలో సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే, వాచకం, అభినయం, ఆహార్యం తో పాటు సాంగ్స్ కూడా పాడుకోవడం అలవాటై ఉండేది. భానుమతి రామకృష్ణ ఇందుకు ప్రబల నిదర్శనం. అయితే మన హీరోలు కూడా అప్పుడప్పుడు ఏదో ఒక సినిమాలో పాట పాడినవాళ్లు ఉన్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా 8సాంగ్స్ పాడాడు. వాటి విషయంలోకి వెళ్తే, 1999లో విడుదలైన తమ్ముడు మూవీలో ‘ తాటిచెట్టు ఎక్కలేవా , ఏం పిల్లవో మాట్లాడవా’ అనే రెండు సాంగ్స్ పాడారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది.
ఖుషి మూవీలో ‘బై బై బంగారు రవణమ్మ ‘ అనే సాంగ్ ని పవన్ పాడారు. ఈ మూవీ 2001లో రిలీజయింది. అలీతో కల్సి పవన్ పండించిన కామెడీ సూపర్భ్. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయింది. 2004లో వచ్చిన గుడుంబా శంకర్ మూవీలో నవ్వో నవ్వో అనే లిరిక్స్ పాడారు. ఈ మూవీ ఏవరేజ్ అయింది. ఇక 2011లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది.
ఈ సినిమాలో ‘పిల్లా నువ్వులేని జీవితం’ అనే సాంగ్ ని వడ్డివేలు శ్రీనివాస్ తో కల్సి పవన్ పాడారు. 2013లో రిలీజైన కాటమరాయుడు మూవీలో ‘కాటమ రాయుడా కదిలి నరసింహుడా పాటను పవన్ ఆలపించారు. ఇక అత్తారింటికి దారేది మూవీలో కాటమరాయుడు అనే పాటను కూడా పవన్ పాడారు. 2018లో వచ్చిన అజ్ఞాతవాసి మూవీలో కొడుకా ఖర్చయిపోతావురా సాంగ్ ని ఆలపించారు.