MoviesTollywood news in telugu

బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ ఎన్ని కోట్ల ఆస్తిని సంపాదించాడో తెలుసా ?

Vadinamma fame Prabhakar :బుల్లితెర చూసే ప్రేక్షకులకు ప్రభాకర్ అంటే తెలియనివారుండరు. సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాగో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్. ప్రభాకర్ యాహు షోతో బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఈటీవీ సుమన్ తో స్నేహం అలా అలా అంచెలంచలుగా ఎదిగి మెగా స్టార్ అయిపోయాడు. సీరియల్స్లో నటించడమే కాకుండా డైరెక్షన్ ప్రొడక్షన్ కూడా చేస్తూ ఒక రేంజ్ లో ఉన్నాడు. అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మెరుస్తున్నాడు. ప్రస్తుతం బుల్లితెరలో చాలా బిజీగా ఉన్నాడు.

స్టార్ మా లో వస్తున్న వదినమ్మ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఒక్కో ఎపిసోడ్ కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. సీరియల్స్లో చూసుకుంటే కార్తీకదీపం తర్వాత వదినమ్మ టాప్ లో ఉంటుంది. ప్రభాకర్ తెలుగు బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు నెలకు 30 లక్షలకు పైగా సంపాదన ఉంటుంది. నటుడిగా నిర్మాతగా రెండు చేతులా సంపాదన ఉంది. ప్రభాకర్ ఆస్తులు సుమారుగా 10 నుంచి 15 కోట్ల వరకు ఉంటాయని అంచనా.