MoviesTollywood news in telugu

పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సాయి పల్లవి

Sai Pallavi Marriage :సాధారణంగా పెళ్లి వయస్సు రాగానే ఎప్పుడు పప్పన్నం పెడతావ్ అని అడగడం రివాజు. ఇప్పుడైతే పాతికేళ్ళు దాటినా పెళ్లికాకపోతే ఇంకా ఎప్పుడు చేసుకుంటావ్ అని అడగడం కూడా తెల్సిందే. ఇలా అడిగినపుడు కొందరు హీరోయిన్లు మాత్రం అసలు పెళ్లి చేసుకోమంటూ హన్సిక లాంటి వాళ్ళు స్టేట్‌మెంట్స్ ఇచ్చి కంగు తినిపిస్తున్నారు. ఇక ఫిదా సినిమాతో నిజంగా కుర్రకారుని ఫిదా చేసిన సాయి ప‌ల్ల‌వి కూడా ఇలాగే పెళ్లి గురించి స్టేట్ మెంట్స్ ఇవ్వడంతో చర్చ మొదలైంది.

కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమ గీమా లాంటివేవీ లేవని స్టడీస్ ముఖ్యమని ఎంబిబిఎస్ చ‌దువుతో బిజీ అయిపోయింది. డాన్సులు, సినిమాలతో ఇప్పుడు కెరీర్ పీక్ స్టేజీలో కి వచ్చేసాక పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేస్తోంది. ప్రస్తుతం ఈమె విరాట పర్వం మూవీతో పాటు లవ్ స్టోరీలో కూడా చేస్తోంది. ఈ రెండు సినిమాలు 2021లోనే విడుదల కానున్నాయి. అంతేకాదు… తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేస్తోంది. ఇంతకీ ఈమె పెళ్లికి దూరంగా ఉండ‌టం ఏంటి..? ఎందుకు ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంది అని ఫాన్స్ తెగ బాధపడిపోతున్నారు.

అయితే అమ్మా నాన్న‌ల‌ను చూసుకోడానికి పెళ్లికి దూరంగా ఉంటానంటూ చెబుతున్నా, ఇక్కడ ఇంకో లాజిక్కు ఉంది. పేరెంట్స్ కోసం పెళ్లి అనే మాట త్యాగం చేయాల‌ని భావిస్తున్న ఈ అమ్మడు నిజంగా సినిమాలో వరుణ్ తేజ్ లాంటి అబ్బాయి దొరికితే పెళ్లి కి రెడీ అంటోంది. దీన్నిబట్టి అర్ధం ఏమిటంటే, ఫిదా సినిమాలో మాదిరిగా తన కోసం అమ్మా నాన్నలతో కలిసిపోయి ఉండే అబ్బాయి కావాలని సాయిపల్లవి చెప్పకనే చెప్పింది. ఓ రకంగా ఇల్లరికం లాంటిదే అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ అమ్మడు ‌లవ్ లో ఫెయిల్ కావడం వల్ల పెళ్లి వద్దంటోందా మరేకారణమైనా ఉందా అనే చర్చ కూడా నడుస్తోంది.