స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన దుర్గారావు
TikTok Durga Rao : డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో గతంలో రవితేజ హీరోగా డాన్ శీను, బలుపు మూవీస్ హిట్ కావడంతో ఇదే కాంబినేషన్ లో క్రాక్ మూవీ వస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. న్యూ ఇయర్ సందర్బంగా జనవరి ఒకటైన ట్రైలర్ కూడా విడుదల చేసున్నారు
ప్రస్తుతం 50శాతం సీట్ల సామర్ధ్యంతో సినిమా థియేటర్లు తెరవడంతో సంక్రాంతి బరిలో క్రాక్ మూవీ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే క్రాక్ మూవీలో యూట్యూబ్ లో పాపులర్ అయిన దుర్గారావు నటిస్తున్నాడు. డాన్సర్ దుర్గారావు ఇప్పటికే టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయ్యాడు.
విచిత్రంగా ఉండే అభినయం, స్టెప్స్, దుర్గారావు భార్య సాంగ్ పాడుతుంటే ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ఇవన్నీ వీళ్ళ క్రేజ్ పెంచాయి. జబర్దస్త్ షోతో పాటు మిగిలిన షోస్ లో కూడా దుర్గారావు, అతడి భార్య కూడా సందడి చేస్తున్నారు. ఇప్పుడు సినిమాలో కూడా దుర్గారావు ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.