మహేష్ బాబు గురించి 5 నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
Mahesh Babu Movie : సూపర్ స్టార్ కృష్ణ దంపతులకు 1975ఆగస్టు 9న చెన్నైలో ఘట్టమనేని మహేష్ బాబు జన్మించాడు. నాలుగేళ్ల వయస్సు వచ్చినదగ్గర నుంచి సమ్మర్ హాలిడేస్ లో కృష్ణతో షూటింగ్స్ వచ్చేవాడు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ అవసరం ఉండడంతో డాక్టర్ దాసరి నారాయణరావు సూచనమేరకు మహేష్ చేత చేయించారు. అలా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంటరయ్యాడు. చెన్నైలో పెరగడం వలన తెలుగు రాయడం, చదవడం రాదు. ఇప్పటికీ కూడా నోటితో చెబితే విని చెప్పడమే, లేదంటే స్క్రిప్ట్ ఇంగ్లీషులో రాసి ఇవ్వడమో చేయాలి.
చిన్నప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేయడంతో సినిమాలపై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. కానీ స్టడీస్ పూర్తయ్యాక వద్దువుగాని అని చెప్పడంతో చెన్నై లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాక, స్టార్ మేకర్ సత్యానంద్ దగ్గర నాలుగు నెలలు ట్రైనింగ్ అయ్యాడు. 1999లో రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ కన్నా నాలుగేళ్లు పెద్దదైన నమ్రత ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. 1972జనవరి 22న పుట్టింది. అందుకే ఇంట్లో మొదట్లో పెళ్ళికి ఒప్పుకోలేదు. ఒకదశలో ఇద్దరూ లేచిపోయి పెళ్లిచేసుకున్నట్లు టాక్ వచ్చింది.
వంశి మూవీతో వీరిద్దరూ పరిచయం అయ్యారు. తర్వాత ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవాలనుకోవడంతో నమ్రత ఇంట్లో ఒప్పుకోలేదు. కృష్ణ కూడా ఫాన్స్ కోసం కొంచెం భయపడి, పెళ్లి వద్దనుకున్నారు. చివరకు ఒప్పుకుని, ముంబైలోని ఓ హోటల్ లో కొందరి కుటుంబ సభ్యుల నడుమ చేసారు. పెద్దగా మాట్లాడడు. ఏదీ పెద్దగా పట్టించుకోడు,సినిమా ప్లాప్ అయితే కొన్నాళ్ళు బయటకు రాడు. ఈ విషయం ఆయనే చెప్పాడు. అతిధి మూవీకోసం జుట్టు పెంచడం, తర్వాత బట్టతల రావడంతో చాన్నాళ్లు బయటకు రాలేదని, హెయిర్ ప్లాంటేషన్ జరిగిందని రూమర్స్ వచ్చాయి. అది మార్ఫింగ్ ఫోటో అని తేలింది. యాడ్స్ తో కల్సి ఏటా 30కోట్లు తీసుకుంటాడని, 300సెకండ్ యాడ్ కి 2కోట్లు తీసుకున్నాడని రూమర్. మొత్తం ఆస్తి 126కోట్లు ఉంటుందని అంటారు.