కార్తీకదీపం సీరియల్ కి శుభం కార్డు పడిపోతుంది…ఎప్పుడో తెలుసా ?
Karthika Deepam serial :స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రేటింగ్ లో దూసుకుపోతూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. చాలా రోజుల బట్టి కార్తీకదీపం సీరియల్ అయిపోతుంది అని అనుకుంటున్నారు. సీరియల్ కి వస్తున్నా రేటింగ్ దృష్ట్యా కథను కాస్త సాగదీస్తూ దీపకు కష్టాలను పెంచుతున్నారు. ఇలా సాగదీస్తూ ఉండటం అనేది రేటింగ్ మీద కూడా ప్రభావం చూపింది. రేటింగ్ బాగున్నప్పుడే సీరియల్ ముగిస్తే బాగుంటుంది అని దర్శక నిర్మాతలు ఆలోచనలో ఉన్నారట.
స్టార్ మా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కార్తీకదీపం సీరియల్ నెల రోజుల్లో ముగిస్తారట. ఇప్పటికే ఈ విషయాన్ని కార్తీకదీపం సీరియల్ నిర్మాణసంస్థ స్టార్ మా వారికి చెప్పేసింది అట.ఆ సమయంలో వేరే సీరియల్ కి ప్లాన్ చేయటం కూడా ప్రారంభం అయిందట.
మొత్తానికి డాక్టర్ బాబు మరియు దీపలను కలవాలంటూ ఎంతో మంది పూజలు వ్రతాలు చేశారు.వారి పూజలు ఫలించి కొన్ని రోజుల్లోనే కార్తక దీపం డాక్టర్ బాబు దీపలు కలువబోతున్నారు.