సూర్య షాకింగ్ రెమ్యునరేషన్… ఎంతో తెలుసా…?
surya remuneration :గజినీ సినిమాతో తెలుగులో కలెక్షన్స్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్న నటుడు సూర్య విభిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ బిల్డప్ చేసుకున్నాడు. తాజాగా వాడివాసల్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై తమిళంలో మంచి అంచనాలున్నాయి.
అయితే ఈ సినిమాకు ఏకంగా 35కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నాడని విన్పిస్తోంది. 2021సెకండాఫ్ లో ఈ మూవీ రిలీజవుతుందని అంటున్నారు. ఇక తెలుగులో కూడా చెప్పుకోతగ్గ ఫాన్స్ ని సంపాదించుకున్న సూర్య లాక్ డౌన్ సమయంలో కూడా సత్తా చాటాడు.
ఆకాశమే నీ హద్దురా అంటూ ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ మీదకు వచ్చి మంచి కలెక్షన్స్ తో పాటు పేరు కూడా తెచ్చుకున్న సూర్య ఈ మూవీతోనే తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేసాడని టాక్ వస్తోంది. ఎన్నో ఒడిడుకులు చూసిన సూర్య విభిన్న సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరవుతూనే ఉన్నాడు.