వంటలక్కకు ఎంత మంది పిల్లలో తెలుసా ?
karthika deepam actress premi viswanath :స్టార్ మాలో వస్తున్న కార్తీక దీపం సీరియల్ ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో ప్రత్యెకంగా చెప్పవలసిన అవసరం లేదు. రేటింగ్స్ పరంగా కూడా అన్నీ సిరియల్స్ కన్నా ముందు ఉంది. ఇక ఈ సీరియల్ లో నటించే దీప అంటే ప్రేమి విశ్వనాథ్ గురించి ఏ విషయం సోషల్ మీద్యలో వచ్చిన ఆమె అభిమానులు బాగా షేర్ చేసేస్తూ ఉంటారు. ఈ మధ్య ప్రేమి విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూ లో ఆమె గురించి ఎన్నో విషయాలు చెప్పింది.
ప్రేమి విశ్వనాథ్ ప్రముఖ ఆస్ట్రాలజర్ వినీత్ భట్ ను వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఇక వీరిద్దరికి ఒక బాబు ఉన్నట్లు తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది.ప్రస్తుతం ఆమె బాబు ప్రేమి విశ్వనాధ్ తల్లి దగ్గర ఉన్నట్లు వాడి ఆలనాపాలనా మొత్తం కూడా ప్రేమి విశ్వనాథ్ అమ్మనే చూసుకుంటున్నట్లు తెలియజేసింది.
ప్రేమి విశ్వనాథ్ ఒక వారం హైద్రాబాద్ లో ఉండి షూటింగ్ పూర్తి చేసుకొని మరో వారం కేరళలో తన కుటుంబంతో గడుపుతుందట. ఇప్పటివరకు బుల్లితెరపై సందడి చేసిన ప్రేమి విశ్వనాథ్ త్వరలో వెండితెర మీద కూడా మెరవటానికి సిద్దం అవుతుంది. ఈ మధ్యనే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.