MoviesTollywood news in telugu

నానికి ఇష్టం లేకుండా బలవంతంగా చేసిన సినిమా ఏదో తెలుసా?

Nani Movies :అసిస్టెంట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ‘అష్టాచమ్మా’ మూవీతో హీరోగా కెరీర్ ప్రారంభించిన నాని తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకుని నేచురల్ స్టార్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్ గా కూడా దుమ్మురేపాడు. అయితే ఇతని కెరీర్లో ఇష్టం లేకుండా యాక్ట్ చేసి హిట్ కొట్టిన ఘటన ఒకటి ఉందట. తొలిసినిమా హిట్ తో రెండో సినిమాగా ”రైడ్” మూవీ చేసాడు. తనీష్ మరో హీరోగా అక్ష – శ్వేతబసు ప్రసాద్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పర్వాలేదనిపించుకుంది. నాని కి మాత్రం మంచి పేరునే తెచ్చింది.

రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీని బెల్లం కొండ సురేష్ నిర్మించారు. అయితే ఈ సినిమా వచ్చిన పదకొండేళ్ల తర్వాత ‘రైడ్’ సినిమా బలవంతంగా నటించానని నాని చెప్పడం విశేషం. బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్’ సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన నాని మాట్లాడుతూ నా కెరీర్ బిగినింగ్ లో ఒకసారి బెల్లంకొండ సురేష్ నా మాట వినలేదని చెప్పాడు.

అప్పట్లో ‘రైడ్’ సినిమా చేయనని చెప్పడానికి ఆయన ఆఫీస్ కు వెళ్తే బలవంతంగా తనతో ఆ సినిమా చేయించారని, అయితే ఆ సినిమా పెద్ద హిట్ అయిందని , కెరీర్ కి కూడా ఆ సినిమా కలిసి వచ్చిందని వివరించాడు. ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ లో షూటింగులో ఉంటానని చెబితే, తన మాట వినకుండా ప్రసాద్ లాబ్స్ లోనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ పెట్టి తనతో బెల్లంకొండ సురేష్ ఈ ట్రైలర్ రిలీజ్ చేయించారని నాని వివరించాడు. ట్రైలర్ చూసాక ఇది కూడా కలిసి వస్తుందని అనిపిస్తోందన్నాడు